BigTV English

Ben Stokes – Jadeja : సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది

Ben Stokes – Jadeja : సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది

Ben Stokes – Jadeja :  మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా పోరాడి.. మ్యాచ్ ను డ్రా చేసుకున్న విషయం విధితమే. ఇంగ్లాండ్ బ్యాటర్లు సూపర్ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ కి ఓటమి తప్పదని అంతా భావించారు. దీనికి తోడు టీమిండియా ఓపెనర్ జైస్వాల్, థర్డ్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ డకౌట్ కావడం.. ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో త్వరగానే ఆలౌట్ అవుతుందనుకున్నా అందరూ. కానీ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఓపెనర్ రాహుల్ అడ్డుగోడ కట్టి టీమిండియా డ్రా చేసేలా చేశారు. ఇక చివర్లో వీరికి తోడు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు సాధించారు. నాలుగో టెస్ట్ లో టీమిండియా డ్రా చేసినప్పటికీ.. గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ భారత్ ఓటమి నుంచి రక్షించారు.


Also Read :  ICC WTC Points Table : 4వ టెస్ట్ డ్రా… WTC పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ప్లేస్ ఎక్కడంటే

జడేజా, సుందర్ బ్యాటింగ్ అద్భుతం.. 


రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. భారత జట్టు కెప్టెన్ గిల్ కొనియాడారు. వాళ్లిద్దరూ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ బెస్ స్టోక్ వచ్చేసి ఓ ఎత్తు గడ వేశాడు. మ్యాచ్ ను త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. స్టోక్స్ రవీంద్ర జడేజాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ను డ్రా ముగించడానికి ప్రయత్నించాడు. జడేజా అతనికి ధీటైనా జవాబు ఇస్తూ.. ఈ నిర్ణయం తన చేతుల్లో లేదని.. ఆట కొనసాగిస్తానని చెప్పాడు. ఈ సమయంలో  కెమెరా భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లినప్పుడు గిల్ నవ్వుతూ కనిపించాడు. గిల్ రియాక్షన్ సోషల్ మీడియాల వైరల్ అయింది. ఇక  మాంచెస్టర్ టెస్ట్ లో భారత్ చేసుకున్న డ్రా.. విజయం కంటే ఎందుకు గొప్పది అంటే.. మనోళ్లు ఇంగ్లండ్ ను మానసికంగా చంపేశారు.

డెడ్డు ఈజీ అనుకున్న స్టోక్స్ 

రీజన్ రెండు రోజుల బ్యాటింగ్.. 669 పరుగుల భారీ స్కోరు పెట్టాం కదా రెండు రోజుల టైమ్ ఉంది ఇండియా ఆలౌట్ అవ్వడం డెడ్డు ఈజీ అనుకున్న బెన్ స్టోక్స్ బ్యాచ్ భారత బ్యాటర్లు బ్రెడ్ హల్వా తినిపించారు. ముందు గిల్, రాహుల్ ఎడతెగని పోరాటం చేస్తే.. తరువాత జడ్డూ, వాషింగ్టన్ సుందర్ ఆడారండీ. టెస్ట్ మ్యాచ్ జిడ్డును రుచి చూపిస్తూ 60 కి పైగా ఓవర్లు కరిగించేసి ఇంగ్లండ్ తో 138 ఓవర్లు బౌలింగ్ చేయించి వాళ్లను శారీరకంగా పూర్తిగా అలిసిపోయేలా చేశారు. బజ్ బాల్ బాల్ బ్యాచ్ కాస్తా బెగ్ బాల్ లా బిహేవ్ చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ జడేజా, వాషింగ్టన్ సెంచరీలు పూర్తి చేసుకోకపోయినా వారి పోరాటం తక్కువ కాదన్నారు. వాళ్లిద్దరూ చాలా అద్భుతంగా ఆడారని.. కేవలం మరో 10 పరుగులు వారి పోరాటానికి కొలమానం కాదన్నట్టు పేర్కొన్నాడు.

Related News

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Big Stories

×