IND Vs ENG : ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ డ్రా గా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో 311 పరుగుల ఆధిక్యం సాధించినప్పటికీ.. ఇంగ్లాండ్ మ్యాచ్ ను గెలవలేకపోయింది. ముఖ్యంగా కీలకమైన ఐదో రోజు ఇంగాండ్ గెలవడానికి 8 వికెట్లు అవసరం. కానీ టీమ్ ఇండియా తరపున కేఎల్ రాహుల్ (90) శుబ్ మన్ గిల్ (102) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తరువాత వాషింగ్టన్, సుందర్, రవీంద్ర జడేజా కూడా క్రీజులో నిలబడ్డారు. ఇంతలో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్, మ్యాచ్ మధ్యలో మోసానికి పాల్పడింది. ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ పేసర్ బ్రైడాన్ కార్స్ తన బూట్లతో బంతిని తొక్కడం ద్వారా బంతిని ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించారు.
Also Read : Ben Stokes – Jadeja : బెన్ స్టోక్స్-జడేజా మధ్య ఏమైంది..? వీడియో వైరల్
బూట్లతో బంతి ట్యాంపరింగ్..
ఈ సంఘటన కెమెరాలో రికార్డు నమోదు అయింది. కార్స్ తన స్ప్రైక్డ్ బూట్లతో బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చూడవచ్చు. ఇంగ్లాండ్ బంతిని ట్యాంపరింగ్ చేయడం ద్వారా మ్యాచ్ గెలించేందుకు ప్రయత్నించింది. ఇంగ్లీషుళ్లు ఎంతటి మోసానికి పాల్పడినా రవీంద్ర జడేజా(107) వాషింగ్టన్ సుందర్ (101) క్రీజులో తమను తాము నిలబెట్టుకొని మ్యాచ్ ను డ్రా గా ముగించగలిగారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. భారత జట్టు కెప్టెన్ గిల్ కొనియాడారు. వాళ్లిద్దరూ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ బెస్ స్టోక్ వచ్చేసి ఓ ఎత్తు గడ వేశాడు. మ్యాచ్ ను త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. స్టోక్స్ రవీంద్ర జడేజాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ను డ్రా ముగించడానికి ప్రయత్నించాడు.
స్టోక్స్ సరైన సమాధానం చెప్పిన జడేజా
జడేజా అతనికి ధీటైనా జవాబు ఇస్తూ.. ఈ నిర్ణయం తన చేతుల్లో లేదని.. ఆట కొనసాగిస్తానని చెప్పాడు. ఈ సమయంలో కెమెరా భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లినప్పుడు గిల్ నవ్వుతూ కనిపించాడు. గిల్ రియాక్షన్ సోషల్ మీడియాల వైరల్ అయింది. ఇక మాంచెస్టర్ టెస్ట్ లో భారత్ చేసుకున్న డ్రా.. విజయం కంటే ఎందుకు గొప్పది అంటే.. మనోళ్లు ఇంగ్లండ్ ను మానసికంగా చంపేశారు. జడేజా, సుందర్ ఐదో వికెట్‌కు 334 బంతుల్లో 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1936 తర్వాత మాంచెస్టర్‌లో భారత్ చేసిన 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాల్లో ఇది రెండోది. ఈ భాగస్వామ్యం నాలుగో టెస్ట్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, భారత్ మాంచెస్టర్ టెస్ట్‌ను డ్రా చేసుకోవడం ద్వారా ఇంగ్లాండ్‌కు గుర్తుచేసిన 46 ఏళ్ల పాత గతం ఏంటంటే.. ఇది 1979లో జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్‌తో ముడిపడి ఉంది. 1979 ఆగస్టులో లార్డ్స్‌లో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో, భారత మొదటి ఇన్నింగ్స్ కేవలం 96 పరుగులకే ముగిసింది. దీనిని సద్వినియోగం చేసుకొని ఇంగ్లాండ్ 9 వికెట్లకు 419 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ విధంగా వారు మొదటి ఇన్నింగ్స్‌లో 323 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 4 వికెట్లకు 318 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అప్పుడు ఇంగ్లాండ్ ఖాయంగా గెలుస్తుందని అనుకున్న ఆశలను భారత్ చెదరగొట్టింది.
English team is Ball Tampering?#INDvsENG #BallTampering pic.twitter.com/Pb020N6AWe
— Forever_Kafir (@Ravi_s33) July 26, 2025