Mahavatar Narsimha vs Kingdom in Srilanka: నో ప్రమోషన్స్, నో బజ్.. అయినా ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్స్ రాబడుతోంది. అదే ’మహాఅవతార్ నరసింహా‘. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో అశ్విన్ కుమార్ మైథలాజికల్ యాక్షన్ యానిమెటేడ్ డ్రామా గా రూపొందించారు. నిజానికి ఇలాంటి ఒక మూవీ వస్తుందని రిలీజ్ ముందు వరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎలాంటి అంచనాలు లేకుండ సైలెంట్ గా జూలై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద గట్టి సౌండ్ చేస్తుంది.
యానిమేటెడ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్సా..
కన్నడ భాషలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ యానిమేటేడ్ డ్రామా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలోనూ విడుదలైంది. అన్ని భాషల్లోనూ విశేష ప్రేక్షకాదరణతో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. బుక్ మై షోలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హరి హర వీరమల్లుకు పోటీగా దిగిన ఈ చిత్రం.. ఇప్పుడు దానికి వెనక్కి నెట్టి సత్తా చాటుతోంది. తొలి మూడు రోజులు వీరమల్లు బజ్ ఉన్నా.. ఆ తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులంత మహావీర్ నరసింహాకే ఓటేస్తున్నారు. యానిమేటెడ్ చిత్రమైన అబ్బురపరిచే విజువల్స్, భారీ యాక్షన్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
వీరమల్లుపై పై చేయి..
ముఖ్యంగా నరసింహా స్వామి అవతరించే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కేవలం మౌత్ టాక్ తోనేఈ చిత్రం సెన్సేషన్ అవుతోంది. బక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్లలో హరి హర వీరమల్లుకు బదులు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దలను ఆకట్టుకుంటూ బాక్సాఫీసు దూకుడు చూపిస్తోంది. తెలుగులో పవర్ స్టార్ వంటి సినిమానే వెనక్కి నెట్టింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేయడం గమనార్హం. ఇక్కడ సత్తా చాటుతున్న ఈ సినిమా త్వరలోనే శ్రీలంకలోనూ విడుదల కాబోతోంది. తెలుగులో హరి హర వీరమల్లుకు పోటీగా దింపారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రాన్ని టార్గెట్ చేస్తోంది హొంబలే ఫిల్మ్స్. ఎందుకంటే జూలై 31న కింగ్ డమ్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.
అక్కడ కింగ్ డమ్ టార్గెట్
ఇది శ్రీలంక ఎల్ టీటీ ఈ ప్రభాకరన్ కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండటంతో కింగ్ డమ్ ను శ్రీలంకలోనూ విడుదల చేయాలనే ఆలోచన ఉన్నారు మేకర్స్. ఇప్పటికే దీనికి అనుమతులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. తమిళం, హిందీ భాషలో అక్కడ విడుదల చేయబోతున్నారట. ఇప్పుడు మహావతార్ నరసింహాను కూడా శ్రీలంకలో రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందట. దీంతో ఇదేక్కడ మాస్ రా మావా. తెలుగులో వీరమల్లును టార్గెట్ చేశారు. ఇప్పుడు కింగ్ డమ్ వంతా అని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారట. మరి తెలుగులో వీరమల్లుపై పై చేయి సాధించిన ఈ సినిమా శ్రీలంకలో కింగ్ డమ్ వెనక్కి నెడుతుందా? లేదా కింగ్ డమ్ ముందు డీలా పడుతుందా? చూడాలి. అయితే అక్కడ ఎల్ టీటీఈకి నాయకుడు ప్రభాకరన్ కి అభిమానులు ఎక్కువ. కాబట్ట ఆ సెంటిమెంట్ శ్రీలంకలో వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువ. పైగా ఇది యానిమేటెడ్ కాబట్టి.. చాలా మంది కింగ్ డమ్ కే ఓటు వేసే అవకాశం. మరి జూలై 31న శ్రీలంక థియేటర్లలో కింగ్ డమ్, మహావతార్ నరసింహా వార్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ తో నటించిన హీరోయిన్ దుర్మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. ఇంతకీ ఆమె ఎవరంటే..