BigTV English

OTT Movie : బ్రీఫ్‌కేస్ కోసం బుర్ర బద్దలయ్యే ఛేజ్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఒక్కసారి చూస్తే వదలరు

OTT Movie : బ్రీఫ్‌కేస్ కోసం బుర్ర బద్దలయ్యే ఛేజ్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఒక్కసారి చూస్తే వదలరు

OTT Movie : బుల్లెట్ ట్రైన్‌లో జరిగే ఒక హై-ఓక్టేన్ హాలీవుడ్ యాక్షన్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఇది బ్రాడ్ పిట్ ఛార్మింగ్ పెర్ఫార్మెన్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్, డార్క్ కామెడీ తో ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి పదినిమిషాలకొక ట్విస్ట్‌తో కేకే పెట్టిస్తోంది. ముఖ్యంగా బ్రాడ్ పిట్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ టోక్యో నుండి క్యోటో వెళ్లే ఒక బుల్లెట్ ట్రైన్‌లో జరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీ టీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బుల్లెట్ ట్రైన్ (Bullet Train) 2022లో విడుదలైన అమెరికన్ యాక్షన్ మూవీ. డేవిడ్ లీచ్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఈ చిత్రం కోటారో ఇసాకా రాసిన జపనీస్ నవల “మరియా బీటిల్” ఆధారంగా తెరకెక్కింది. ఇందులో బ్రాడ్ పిట్, జోయీ కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీ, ఆండ్రూ కోజీ, హిరోయుకీ సనాడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టోక్యో నుండి క్యోటో వెళ్లే ఒక బుల్లెట్ ట్రైన్‌లో జరిగే హై-ఓక్టేన్ యాక్షన్ సినిమా. IMDbలో బుల్లెట్ ట్రైన్కి 7.3/10 రేటింగ్ ఉంది. Netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లేడీబగ్ (బ్రాడ్ పిట్) అనే వ్యక్తి ఒకప్పుడు కిరాయి హంతకుడిగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం శాంతియుత జీవితం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఒక పని చేయాల్సి వస్తుంది. టోక్యో నుండి క్యోటో వెళ్లే బుల్లెట్ ట్రైన్‌లో ఒక బ్రీఫ్‌కేస్‌ను దొంగతనం చేసి దిగిపోవాలి. లేడీబగ్‌కి ఈ పని చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ట్రైన్‌లోకి అడుగుపెట్టగానే, అతను ఊహించని గందరగోళంలో చిక్కుకుంటాడు. ఈ ట్రైన్‌లో లేడీబగ్ ఒక్కడే కిరాయి హంతకుడు కాదు. ఇంకా చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ సొంత మిషన్‌తో ఉంటారు. టాన్జరిన్, లెమన్ అనే ఇద్దరు బ్రిటిష్ హంతకులు, ఒక బ్రీఫ్‌కేస్‌తో పాటు వైట్ డెత్ అనే రష్యన్ మాఫియా బాస్ కొడుకును రక్షించే మిషన్‌లో ఉంటారు.

ప్రిన్స్ అనే ఒక కన్నింగ్ అమ్మాయి, ఒక హంతకురాలిగా నటిస్తూ, ఒక సీక్రెట్ ప్లాన్‌ను అమలు చేస్తుంది. ది వోల్ఫ్ అనే ఒక మెక్సికన్ హంతకుడు, పగ కోసం ట్రైన్‌లో ఉంటాడు. ది హార్నెట్ మరొక హంతకురాలు విషం ఉపయోగించి హత్యలు చేస్తుంటుంది. ఇంకా కిమురా అనే ఒక సమురాయ్, తన కొడుకును రక్షించడానికి ట్రైన్‌లోకి వస్తాడు. ఈ బ్రీఫ్‌కేస్ అందరి మధ్య గొడవకు కారణమవుతుంది. ఎందుకంటే అది వైట్ డెత్ కు చెందిన (మైఖేల్ షానన్) డబ్బుతో నిండి ఉంటుంది. కథ ముందుకు సాగే కొద్దీ, ఈ హంతకులందరూ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ, ఒకరి మిషన్‌లు మరొకరితో ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది. లేడీబగ్ ఈ గందరగోళం నుంచి బతికి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని “బ్యాడ్ లక్” ఎప్పుడూ అతన్ని వెంటాడుతుంది.

Read Also : సండే ఆఫీస్ పేరుతో బాస్ నిర్వాకం… భర్త దగ్గర ప్రైవేట్ వీడియో లీక్… హీరోయిన్ చేసే పనికి మైండ్ బ్లాక్

కథలో ట్విస్ట్‌లు ఒక్కటేమిటి, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం ఉంటుంది. ఇంతలో వైట్ డెత్ కూతురు ప్రిన్స్ అని తెలుస్తుంది. ఆమె తన తండ్రి దగ్గర నుండి రివెంజ్ తీర్చుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. క్లైమాక్స్‌లో ట్రైన్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో క్రాష్ అవుతుంది. ఇక వైట్ డెత్ స్వయంగా ట్రైన్‌లోకి వచ్చి అందరినీ ఎదుర్కొంటాడు. లేడీబగ్, కిమురా, ఎల్డర్ కలిసి వైట్ డెత్‌ తో తీవ్రంగా పోరాడుతారు. కానీ చాలా మంది హంతకులు ఈ గొడవలో చనిపోతారు. ఇక క్లైమాక్స్ ఈ యాక్షన్ సీన్స్ తోనే ముగుస్తుంది. చివరికి లేడీబగ్ బ్రీఫ్‌కేస్‌తో బయటపడతాడా ? వైట్ డెత్ పై కూతురు ఎందుకు రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది ? వైట్ డెత్ ఏమవుతాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×