BigTV English

Ben Stokes – Pant: రిషబ్ పంత్ కాలుపై కుట్రలు చేసిన స్టోక్స్.. కావాలనే ఆ బంతులు వేసి!

Ben Stokes – Pant: రిషబ్ పంత్ కాలుపై కుట్రలు చేసిన స్టోక్స్.. కావాలనే ఆ బంతులు వేసి!

Ben Stokes – Pant: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లోని తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 358 పరుగులకు ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోర్ 264/4 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 94 పరుగులు చేసి మిగతా 6 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి రోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.


Also Read: RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?

క్రిస్ వోక్స్ బౌలింగ్ లో పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి నేరుగా అతడి కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో రక్తస్రావం కావడంతోపాటు పాదం వాచిపోయింది. ఈ క్రమంలో నేల మీద పాదం పెట్టేందుకు కూడా అల్లాడిపోయాడు రిషబ్ పంత్. ఇక ఆ వెంటనే గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సహాయంతో రిటైర్డ్ హార్ట్ గా మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ మళ్లీ బ్యాటింగ్ చేయడం కష్టమేనని అంతా భావించారు. ఇక తొలిరోజు ఆట ముగిసిన తర్వాత.. ఓవర్ నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించి రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు.


అనంతరం వాషింగ్టన్ సుందర్ క్రీజ్ లోకి వచ్చాడు. ఇక శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి.. ఆరో వికెట్ కి 38 పరుగులు జోడించారు. అనంతరం శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు త్వరగానే ఆల్ అవుట్ అవుతుందని అంతా భావించారు. కానీ జట్టు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తిరిగి బ్యాట్ పట్టుకుని కుంటుతూనే క్రీజ్ లోకి వచ్చాడు రిషబ్ పంత్. నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు.

బెన్ స్టోక్స్ బౌలింగ్ లో బౌండరీ బాదీ.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సింగిల్స్ తీయకుండా కేవలం భారీ షార్ట్స్ కే పరిమితమయ్యాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం పంత్ కుడి పాదాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్.. పదేపదే యార్కర్లు వేశాడు. అది కూడా రిషబ్ పంత్ కుడి కాలిని టార్గెట్ చేస్తూ బంతులు సంధించాడు. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ ఈ బంతులను ఎదుర్కొని తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు.

Also Read: Sai Sudarshan: సాయి సుదర్శన్ సైంటిస్టుల రాస్తున్నాడు.. శిష్యుడిలా సుందర్ చూస్తున్నాడు… ఏంట్రా ఇద్దరి గోల.. ముందు టీమిండియాను గెలిపించండి రా

ఆర్చర్ కూడా అదే పని చేశాడు. కానీ పంత్ ఎదురుదాడికి దిగి రెండు భారీ సిక్సర్లు బాదాడు. అలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఆర్చర్ బౌలింగ్ లోనే క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో కాసేపటికే టీమిండియా ఇన్నింగ్స్ కి తెరపడింది. అయితే గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న పంత్ పాదాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయడం పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టుకు క్రీడా స్ఫూర్తి అంటే ఏంటో తెలియదని విమర్శిస్తున్నారు.

Related News

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Big Stories

×