Mohammad Siraj : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో 2-2తో సమం చేసింది. ముఖ్యంగా 5 టెస్ట్ లో విజయం సాధించడానికి కారణంగా టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజే కారణం అని చెప్పవచ్చు. ఈ సిరీస్ లో ఐదు టెస్ట్ లు చివరి వరకు ఆడిన ఏకైక ఫేస్ బౌలర్ కూడా సిరాజే. 1113 బంతులు.. సిరీస్ తొలి రోజు నుంచి చివరి రోజు వరకు బౌలింగ్ లో అదే వేగం కనబరిచాడు. ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన.. చేసే పని భారంగా అనిపించలేదు. సుదీర్ఘ సిరీస్ లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు. మ్యాచ్ మధ్యలో ఫిట్ నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్ కి దూరం కాలేదు.
Also Read : Sunil Gavaskar : మళ్లీ వర్కౌట్ అయిన గవాస్కర్ ‘లక్కీ జాకెట్’ సెంటిమెంట్..!
రెండు గంటల ముందు నిద్ర లేచి
లండన్ లో సోమవారం ఉదయం నిద్ర లేవగానే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన మొబైల్ వాల్ పేపర్ కోసం నెట్ లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి రెగ్యులర్ అతను లేచే సమయం కంటే రెండు గంటలు ముందుగానే నిద్రలేచాడు. ఆ తరువాత తన ఆరాధ్య దైవం క్రిస్టియానో రొనాల్డో చిత్రం డౌన్ లోడ్ చేసి.. దానికి “బిలీవ్” అనే పదాన్ని పొందుపరిచాడు. దానిని తన వాల్ పేపర్ గా సెట్ చేసుకున్నాడు. ఇక ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి సెషన్ కోసం ది ఓవల్‌లో మైదానంలోకి అడుగు పెట్టడానికి ముందు అతనికి సరిగ్గా అదే అవసరం. తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విజేత ప్రదర్శన తరువాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో సిరాజ్.. క్రిస్టియానో రొనాల్డో వాల్ పేపర్ ను జర్నలిస్టులకు గర్వంగా చూపించాడు.
తన ఫోన్ వాల్ పేపర్ ని చూపిస్తూ..
“సాధారణంగా ఉదయం నిద్రలేవగానే.. వాల్ పేపర్ కోసం వెతికాను. క్రిస్టియానో రొనాల్డోతో బీలీవ్. నేను ప్రత్యేకంగా ఏదైనా చేయలగనని నాకు తెలుసు. ముఖ్యంగా ప్రతీ రోజు నేను 8 గంటలకు మేల్కొంటాను. కానీ ఇవాళ ఉదయం 6 గంటలకే నిద్ర లేచాను. ఆ క్షణం నుంచి నేను దీన్ని చేయగలనని నమ్మాను. దానిని నా వాల్ పేపర్ గా చేశాను. నమ్మకం చాలా ముఖ్యం” అని చెప్పుకొచ్చారు సిరాజ్. ఐదో రోజు ఆటలో సిరాజ్ జెమీ స్మిత్ ను ఔట్ చేయడం ద్వారా తొలి దెబ్బ కొట్టాడు. ఇక ఆల్ రౌండర్ అట్కిన్సన్ ని యార్కర్ తో బౌల్డ్ చేసి భారత్ కి విజయాన్ని అందించాడు. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 367 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే 9 వికెట్లు పడగానే.. తన భుజం గాయంతో చిన్నాభిన్నమైనప్పటికీ ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసేందుకు ధైర్యంగా గ్రౌండ్ లోకి వచ్చాడు వోక్స్. అందరి మన్నననలు పొందాడు. ఇక టీమిండియా బౌలర్ సిరాజ్ గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సెన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహం లా పోరాడిన ఓ లయన్ హార్ట్ బౌలర్ అని ప్రశంసలు కురిపించారు.
Mohammad Siraj showing the wallpaper of his phone – Believe & Cristiano Ronaldo. ❤️ pic.twitter.com/n5z6WH2fFD
— Tanuj (@ImTanujSingh) August 4, 2025