E-Paper
Advertisement

IND VS ENG : ఓలీ పోప్ అద్భుత సెంచరీ.. కోలుకున్న ఇంగ్లాండ్..

IND VS ENG : హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడోరోజు మ్యాచ్ లో ఇంగ్లాండ్ దే పై చేయిగా మారింది. వారిని ఆల్ అవుట్ చేయడంలో టీమ్ ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకుపోయాడు. భారత విజయానికి ఒక్కడూ అడ్డం పడ్డాడు.

IND VS ENG : ఓలీ పోప్ అద్భుత సెంచరీ.. కోలుకున్న ఇంగ్లాండ్..
Advertisement
IND VS ENG

IND VS ENG : హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడోరోజు మ్యాచ్ లో ఇంగ్లాండ్ దే పై చేయిగా మారింది. వారిని ఆల్ అవుట్ చేయడంలో టీమ్ ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకుపోయాడు. భారత విజయానికి ఒక్కడూ అడ్డం పడ్డాడు.

మొత్తానికి తనొక్కడూ 208 బంతులాడి 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో 17 ఫోర్లున్నాయి. ఎక్కడా కూడా సిక్స్ కొట్టేందుకు క్రీజు బయటకు రాకుండా ఆడాడు. అదే మనవాళ్లయితే ముందు సిక్స్ కొట్టాలి. తర్వాత సింగిల్ తీయాలన్నట్టే ఆడారు. తను ఒక ఎండ్ లో ఉండిపోవడంతో మిగిలిన వారు తనకి సపోర్ట్ ఇస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించారు.

Advertisement

ఇప్పటికి ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు 200 పరుగుల లోపు ఆలౌట్ చేయగలిగి,మళ్లీ మనవాళ్లు విజయం కోసం పోరాడాలి.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది. చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఉదయం ఆట ప్రారంభించిన రవీండ్ర జడేజా (87), అక్షర్ పటేల్ (44) త్వరగా అవుట్ అయిపోయారు.

Advertisement

అయితే జో రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రాను ఔట్ చేశాడు. జడేజా అవుట్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ కావడంతో భారత్ కథ 436 పరుగుల వద్ద ముగిసిపోయింది. అంతమందిలో బుమ్రా ఒక్కడే డకౌటయ్యాడు.ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్ లీ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను బజ్‌బాల్ వ్యూహంతోనే మొదలు పెట్టింది. కాకపోతే వికెట్లు పడటంతో వెంటనే వ్యూహం మార్చి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఓపెనర్ జాక్ క్రాలే (31), డక్కెట్ (47), జో రూట్‌ (2), బెయిర్ స్టో (10), బెన్ స్టోక్స్ (6), బెన్ ఫోక్స్ (34) అవుట్ అయ్యారు.

కానీ వన్‌డౌన్‌లో వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకపోయాడు. మనవాళ్లు ముగ్గురు బ్యాటర్లు 80 పరుగుల వద్ద ఆగిపోయారు. కానీ తను మాత్రం సెంచరీ సాధించాడు. అంతేకాదు 148 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం రెహాన్ అహ్మద్ (16*)తో కలిసి పోప్ ఎంతవరకు మ్యాచ్ ను ముందుకు తీసుకువెళతాడనే దానిపై ఇండియా విజయ లక్ష్యం ఆధారపడి ఉంది.భారత్ బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, అక్షర్ పటేల్ 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×