BigTV English

IND Vs ENG India 1st Innings : యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 336/6..

IND Vs ENG India 1st Innings : యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 336/6..

Ind vs Eng test 2024 (sports news today India) :


IND Vs ENG India 1st Innings
IND Vs ENG India 1st Innings

భారత్ -ఇంగ్లాండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టులో మొదలైంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. రజత్ పటీదార్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. చైనామన్ స్పిన్నర్ కులదీప్ యాదవ్, పేసర్ ముఖేశ్ కుమార్ కు తుది జట్టులో స్థానం దక్కింది. గాయాలతో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. పేసర్ మహ్మద్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడారు. తొలి వికెట్ 40 పరుగులు జోడించిన తర్వాత హిట్ మ్యాన్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. తొలి మ్యాచ్ ఆడుతున్న సోయబ్ బషీర్ .. రోహిత్ ను అవుట్ చేశాడు. క్రీజులో వచ్చినప్పటినుంచి దూకుడిగా ఆడిన గిల్ 34 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు.


లంచ్ విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి జైస్వాల్ ( 51 బ్యాటింగ్) , శ్రేయస్ అయ్యర్ ( 4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

లంచ్ తర్వాత జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 179 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ (27) స్పిన్నర్ హార్ట్ బౌలింగ్ లో కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు రజత్ పటీదార్ బ్యాటింగ్ దిగాడు. జైస్వాల్ తో కలిసి 60 పరుగులు భాగ్యసామ్య నెలకొల్పిన తర్వాత పటీదార్ ( 32) రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అప్పటి టీమిండియా స్కోర్ 249 పరుగులు. జైస్వాల్ మాత్రం ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతడికి అక్షర్ పటేల్ జత కలిశాడు. అయితే క్రీజులో కుదురుకున్న సమయంలో అక్షర్ (27) షోయబ్ బషీర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 301 పరుగుల వద్ద టీమిండియా 5 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కీపర్ కేఎస్ భరత్ (17) ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (179 బ్యాటింగ్), రవిచంద్రన్ అశ్విన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు.. హార్ట్ లీ, అండర్సన్ తలో వికెట్ తీశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×