Rakul Preet – Jockey: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త ప్రముఖ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నాని ఇప్పుడు అరుదైన అవార్డును అందుకున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న ఈ జంట అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది -రకుల్ ప్రీత్ సింగ్
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..” ప్రపంచ యోగ దినోత్సవం రోజు ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగా వైపు ఆకర్షితులు చేయడంలో భాగంగా మరింత ఆనందంగా ఉంది. ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్ గా మారొచ్చు” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. దేశంలోనే ఈ అవార్డు అందుకున్న ఏకైక జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ ప్రేమ, పెళ్లి..
టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పుడే ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో పడి, గత ఏడాది వివాహం చేసుకుంది. 2021లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక 2024 ఫిబ్రవరి 21న హిందూ సాంప్రదాయం ప్రకారం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది ఈ జంట. అంతేకాదు హైదరాబాదులో కూడా వీరికి ఒక ఇల్లు ఉన్న విషయం తెలిసిందే.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు..
రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి ‘కెరటం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో సిద్ధార్థ రాజ్ కుమార్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత ‘యువన్’ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగులో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ మొదటి నటిగా 61వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేషన్ చేయబడింది. ఇక తర్వాత దివ్య కుమార్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘యారియన్’ అనే సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అన్ని భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.
ALSO READ: Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఆత్మహత్య!