BigTV English

MPL 2025 : బుల్డోజర్ల లాగా గుద్దుకున్నారు… ఇద్దరు రనౌట్ అయ్యేవాళ్ళు..కానీ చెత్త ఫీల్డింగ్ తో

MPL 2025 : బుల్డోజర్ల లాగా గుద్దుకున్నారు… ఇద్దరు రనౌట్ అయ్యేవాళ్ళు..కానీ చెత్త ఫీల్డింగ్ తో

 MPL 2025 :  సాధారణంగా క్రికెట్ లో కొన్ని ఆసక్తికర, అరుదైన  సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడూ ఎవ్వరూ ఎలా వ్యవహరిస్తారో చెప్పడం చాలా కష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా  కొందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరూ 1, 2 బంతుల్లోనే ఔట్ అవుతారు. మరికొందరూ బౌలింగ్ రాణిస్తే.. ఇంకొందరూ ఫీల్డింగ్ లో, కీపింగ్ లో స్టంప్స్ చేయడంలో వికెట్లు తీయడంలో ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఫేమస్ అవుతుంటారు. అలా ఫేమస్ అయ్యే వారు కూడా కొన్ని సందర్భాల్లో విఫలం కూడా చెందుతారు.  వీటికి సంబంధించి  కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం.  ముఖ్యంగా  ఇలాంటి వీడియో లను  చూసి నెటిజన్లు ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read : Yashasvi jaiswal : ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి సెంచరీ.. 100 చరిత్రలో ఏకైక క్రికెటర్ గా రికార్డు

వాస్తవానికి  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తరువాత మధ్య ప్రదేశ్ ప్రీమియర్ లీగ్, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ దశ మ్యాచ్ లలో ఐపీఎల్ మాదిరిగానే మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో నిన్న  రాయ్ గడ్ రాయల్స్ వర్సెస్ కొల్తాపూర్ టస్కర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాయ్ గడ్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా కోల్తాపూర్ టస్కర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాయ్ గడ్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్ బంతి వేయగానే సింగిల్ తీశారు. ఫీల్డర్ బంతి వేయకపోవడంతో రెండో రన్ కోసం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఇద్దరూ బ్యాట్స్ మెన్ చూసుకోకుండా ఒకరికొకరూ గుద్దుకున్నారు. దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. వెంటనే ఒక బ్యాట్స్ మెన్ లేచి పరుగెత్తాడు. అప్పటికే వికెట్ కీపర్  బంతిని బౌలర్ వైపు విసిరివేయగా.. అప్పటికే క్రీజులోకి చేరుకున్నాడు బ్యాట్స్ మెన్.


మరో బ్యాట్స్ మెన్ కిందనే పడి ఉండటంతో వికెట్ కీపర్ కి బంతి అందించకుండా నేరుగా పరుగెత్తి రాహుల్ త్రిపాఠి వికెట్ల దగ్గరికి వెళ్లి బంతిని విసిరేశాడు. బంతిని వికెట్లకు తాకకుండా నేరుగా ఫోరు పోయింది. దీంతో ఒక్క బంతికి 6 పరుగులు రావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి కరెక్ట్ ఫీల్డింగ్ చేస్తే.. ఇద్దరూ రన్ ఔట్ అయ్యే వాళ్లు. కానీ చెత్త ఫీల్డింగ్ వల్ల ఇద్దరూ రన్ ఔట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.  ఇంత మంచి అవకాశాలను అసలు మిస్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. క్రికెట్ లో ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం అనే చెప్పవచ్చు.

?igsh=MWlxeXVxbHhqYWZnOQ==

Related News

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

Big Stories

×