IND VS NZ 1ST ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI) మధ్య ఇవాళ ప్రారంభమైన వన్డే మ్యాచ్ లో గిల్ సేన బోణీ కొట్టింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, మొదటి వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరలో కేఎల్ రాహుల్ సిక్సర్ తో మ్యాచ్ గెలిపించాడు. అటు విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో మొదటి వన్డేలో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విధించిన 300 పరుగుల టార్గెట్ ను కేవలం 6 వికెట్లు నష్టపోయి 49 ఓవర్లలో ఫినిష్ చేసింది టీం ఇండియా. దీంతో ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వడోదర వన్డే మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో మనోళ్లు విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్క్ ఓడిపోయి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ జట్టు 300 పరుగుల భారీ లక్ష్యాన్ని టీం ఇండియా ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా ప్లేయర్లు చాలా అద్భుతంగా రాణించారు.
రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇద్దరు విఫలమైనప్పటికీ గాయంతో బాధపడుతూ బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర కూడా అదరగొట్టాడు. కోహ్లీ, గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా చివరలో గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రానా ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 29 పరుగులు చేయడమే కాకుండా కేఎల్ రాహుల్ కూడా 29 పరుగులు చేసి రఫ్పాడించాడు. చివరలో సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు రాహుల్. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, హర్షిత్, కెఎల్ రాహుల్ రియల్ హీరోలు అని చెప్పవచ్చు.
న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్లో 93 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు సాధించిన రెండవ టీం ఇండియా ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 34,357 పరుగులు సాధించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 28 వేలకు పైగా పరుగులు సాధించి సంగక్కర రికార్డు బద్దలు కొట్టాడు. అటు సంగక్కర 28 వేల 16 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 27 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇక ఐదవ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ 25,957 పరుగులతో నిలిచాడు.
इंटरनेशनल क्रिकेट में सबसे तेज 28 हजार रन बनाने वाले खिलाड़ी बने विराट कोहली 🏏💪
कोहली ने यह कीर्तिमान महज 624 पारियों में हासिल किया pic.twitter.com/9UVWAsJ6kl
— CricTracker Hindi (@ct_hindi) January 11, 2026