BigTV English

IND vs PAK: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హిట్ మ్యాన్‌కు గాయం

IND vs PAK: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హిట్ మ్యాన్‌కు గాయం

IND vs PAK: టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా నసావు కౌంటీ అంతర్జాతీయ మైదానంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానుకులకు బిగ్ షాక్ తగిలింది. దాయాదుల పోరుకు ముందు భారత్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ బొటన వేలుకు గాయం కావడంతో పాక్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాక్టీస్ పిచ్‌లో బంతి ఓవర్ బౌన్స్ అవుతుందని ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. కాగా, అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.


అభిమానుల్లో టెన్షన్..

ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించడంతో జట్టు విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి సైతం ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి తరుణంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బొటన వేలికి గాయం కావడంతో క్రీడాభిమానుల్లో ఆందోళన నెలకొంది. త్రోడౌన్ స్పెషలిస్టు నువాన్ వేసిన బంతి ఒక్కసారిగా బౌన్స్ కావడంతో క్రీజులో ఉన్న రోహిత్ చేతికి బలంగా తాకింది. దీంతో వెంటనే వైద్యులు మైదానంలో చేరుకొని ఆయనకు చికిత్స అందించారు. ఎంతసేపటికీ నొప్పి తగ్గకపోవడంతో చేసేదేమిలేక మైదానం నుంచి రోహిత్ వెనుదిరిగాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్పందించలేదు.


Also Read: శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్..

రోహిత్ దూరమైతే.. పరిస్థితి ఏంటి?

పాకిస్తాన్‌తో మ్యాచ్ వేళ కెప్టెన్ రోహిత్‌కు గాయమైంది. ఈ కీలక మ్యాచ్‌కు రోహిత్ దూరమైతే పరిస్థితి ఏంటనే విషయంపై టీం మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ రోహిత్ ఈ మ్యాచ్‌ ఆడకపోతే కెప్టెన్‌గా ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడగా.. పిచ్ స్వభావంతో బంతి బ్యాటర్లకు సహకరించ లేదు. బంతి ఆగి రావడం, అనూహ్యమైన బౌన్సర్లు రావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఇలా బంతి వేగంగా తగలడంతో కెప్టెన్ రోహిత్ గాయపడి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే రోహిత్‌కు గాయమైనప్పటికీ అతడు ఉత్సాహంతో ఉండడంతోపాటు నెట్ ప్రాక్టీస్‌లో చురుకుగా ఆడినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే జూన్ 9న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×