E-Paper
Advertisement

SL vs BAN Highlights T20 World Cup 2024: శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్..

SL vs BAN Highlights T20 World Cup 2024: శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్..
Advertisement

Sri Lanka vs Bangladesh Highlights, T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. డల్లాస్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఇదేరోజు ఆఫ్గాన్ చేతిలో కివీస్ కూడా ఓటమిపాలైంది. సాయంత్రం మరో రెండు మ్యాచ్ లున్నాయి. అవెలా జరుగుతాయో చూడాలి.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన శ్రీలంక 20 ఓవర్లలో పడుతూ లేస్తూ 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement

125 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కి  శుభారంభం  దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరిలో ఒకరు తంజిద్ హాసన్ (3), మరొకరు సౌమ్య సర్కార్ డక్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన లిటన్ దాస్ (36) కొంచెం జాగ్రత్తా ఆడాడు. ఆ తర్వాత తౌహిద్ 20 బంతుల్లో 4 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో ధనాధన్ 40 పరుగులు చేసి స్కోరు బోర్డుని ముందుకు తీసుకువెళ్లాడు.

కెప్టెన్ హోసైన్ శాంతో (7), షకీబ్ అల్ హాసన్ (8) త్వరగా అవుట్ అయ్యారు. చివర్లో మహ్మదుల్లా 13 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. మొత్తానికి 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకుంది.

Advertisement

Also Read: ఆఫ్గాన్ గన్ బౌలింగ్ .. కివీస్ 84 పరుగుల తేడాతో ఓటమి

శ్రీలంక బౌలింగులో తుషార 4, కెప్టెన్ హసరంగ 2, పతిరణ 1 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంకకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కుశాల్ మెండిస్ (10) తర్వగా అయిపోయాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన కమిందు మెండిస్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. మరో ఓపెనర్ గా ఉన్న నిశాంక మాత్రం జాగ్రత్తగా ఆడి…స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. 28 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత ధనుంజయ్ డిసిల్వా (21), అసలంక (19), ఏంజిలో మాథ్యూస్ (16) కాసేపు మెరిపించి అవుట్ అయ్యారు. కెప్టెన్ హసరంగ తో పాటు మరొకరు డక్ అవుట్ అయ్యారు. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ బౌలింగులో షకీబ్ 1, తస్కిన్ అహ్మద్ 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, రిషద్ హోసైన్ 3 వికెట్లు పడగొట్టారు.

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×