BigTV English

IND vs SA 1st Test : ఇక సిక్సర్ల శర్మగా రోహిత్..? ధోనీ రికార్డును దాటుతాడా..?

IND vs SA 1st Test : ఇక సిక్సర్ల శర్మగా రోహిత్..? ధోనీ రికార్డును దాటుతాడా..?
IND vs SA 1st Test

IND vs SA 1st Test : సౌతాఫ్రికా గడ్డపై మొదలయ్యే తొలిటెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు ఎన్నో పేర్లున్నాయి. అందులో ఒకటి హిట్ మ్యాన్. అది కాకుండా మరో పేరుంది.


అదేమిటంటే సిక్సర్ల శర్మ.  అలాంటి రోహిత్ ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ పై కన్నేశాడు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో భారత్ నుంచి మొదటి వరుసలో సెహ్వాగ్ ఉంటే, తర్వాత ధోనీ ఉన్నాడు. వీరి తర్వాత మూడో స్థానంలో రోహిత్ ఉన్నాడు.

సౌతాఫ్రికాతో మొదలయ్యే టెస్ట్ మ్యాచ్ లో  రోహిత్ సిక్సర్ల రికార్డు అధిగమిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతకీ సెహ్వాగ్ 178 ఇన్నింగ్స్ లో 90 సిక్సర్లు కొడితే, ధోనీ 144 ఇన్నింగ్స్ లో 78 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ అయితే 88 ఇన్నింగ్స్ లో 77 సిక్సర్లతో ఉన్నాడు. ఇప్పుడొక సిక్సర్ కొట్టి ధోనీ సరసన చేరతాడో లేదంటే, రెండు కొట్టి ధోనీని దాటుతాడో వేచి చూడాల్సిందే.


వీరిద్దరిలో లేని ప్రత్యేకత రోహిత్ శర్మకి ఒకటుంది. అదేమిటంటే సెహ్వాగ్ 90 సిక్సర్లు కొట్టడానికి 178 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ధోనీ 78 సిక్సర్లకు 144 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఇక్కడ ధోనీ అంటే తను ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు కాబట్టి, అన్ని ఇన్నింగ్స్ తీసుకున్నాడంటే అర్థం ఉంది. కానీ సెహ్వాగ్ ని చూస్తే ఓపెనర్ గా వెళ్లి కూడా అన్ని ఇన్నింగ్స్ తీసుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే రోహిత్ శర్మ విషయానికి వస్తే కేవలం 88 ఇన్నింగ్స్ లో 77 సిక్సర్లు కొట్టిపారేశాడు. ధోనీ సరసన చేరాడు. అలాగే ధోనీ చేసిన ఇన్నింగ్స్ తో పోల్చితే సగం ఇన్నింగ్స్ లోనే ధనాధన్ బ్యాటింగ్ తో సిక్సర్ల మోత మోగించాడు. అందుకే నెట్టింట అందరూ సిక్సర్ల శర్మగా పిలుస్తున్నారు.

వర్షం వచ్చి మ్యాచ్ సాగితే… అభిమానుల అందరి కోరిక రోహిత్ శర్మ తీరుస్తాడా? లేదా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే తనకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో అందరికీ తెలిసిందే. కెప్టెన్సీ విషయంలో ముంబై ఇండియన్స్ ని అన్ ఫాలోయింగ్ చేసినప్పుడే అందరికీ అర్థమైంది.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత మళ్లీ బ్యాట్ పట్టుకుని రోహిత్ శర్మ భారత్ జట్టులోకి వచ్చాడు. మరి ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాల్సిందే.

.

.

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×