BigTV English

India’s Tour of Zimbabwe: ఆంధ్రా ఆటగాడు నితీశ్ కు గాయం: దూబెకు చోటు!

India’s Tour of Zimbabwe: ఆంధ్రా ఆటగాడు నితీశ్ కు గాయం: దూబెకు చోటు!

Shivam Dube Replace Nitish Reddy in India’s squad for Zimbabwe Tour 2024: ఐపీఎల్ 2024 సీజన్ లో హైదరాబాద్  తరఫున దుమ్ము దులిపిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ కి జాతీయ జట్టులో చోటు దొరికింది. జులై 6 నుంచి జింబాబ్వేలో జరిగే 5 టీ20ల సిరీస్ కి ఎంపికయ్యాడు. అయితే ఆ సంతోషం వెంటనే ఆవిరైపోయింది.


ఎందుకంటే నితీశ్ కి తాజాగా హెర్నియాకి గాయమైంది. దీంతో అతను సీరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో శివమ్ దుబెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆంధ్రా ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం పట్టేలా ఉంది.

ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున 21 ఏళ్ల నితీశ్ కుమార్ 303 పరుగులు చేసి బీసీసీఐ పెద్దల దృష్టిలో పడ్డాడు. అంతేకాదు బౌలింగు చేసి 3 వికెట్లు కూడా తీశాడు. ఆల్ రౌండర్ గా కూడా ఆకట్టుకున్నాడు. అయితే బీసీసీఐ యువ ఆటగాళ్ల టార్గెట్ గ్రూప్ లో ఉన్న నితీశ్ కుమార్ గత ఏడాది కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీలో వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఉన్నాడు.


Also Read: బాబూ.. ఎంతో కొంత ఇవ్వండి! పాకిస్తాన్ ఆటగాళ్ల దైన్యం..

జింబాబ్వే లో టీ 20 సిరీస్ ఆడే భారతజట్టు: శుభ్ మన్ గిల్ (కెప్టెన్),  శివమ్ దుబె, రియాన్ పరాగ్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైశ్వాల్ , రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు.

Tags

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×