
Rohit Sharma : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.చాలామంది ఇండియా గెలుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారని, అవన్నీ నేను నమ్మనని అన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదని చెప్పాడు.
మనం కష్టపడి ఆడామా? లేదా? అదొక్కటే ఫైనల్ మ్యాచ్ ని నిర్ణయిస్తుందని అన్నాడు. అలాగే ఇప్పటికి పదికి పది గెలిచాం, అనే సంగతి మరిచిపోయానని అన్నాడు. అది గతం అని తెలిపాడు. ఆ విజయాలు నిన్నటి రోజు ఖాతాలో పడిపోయాయని చెప్పాడు. అది గెలిచామా?ఓడామా? కాదు ఇప్పుడు పైనల్లో ఏం చేశామనేదే ముఖ్యమని తెలిపాడు. కొన్ని రిటైర్మెంట్ అయ్యాక జ్నాపకాలుగా బాగుంటాయని అన్నాడు.
కానీ ఇప్పుడు వాస్తవంలోకి రావాలి అదే నిజమని అన్నాడు. అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో ఉన్నాం. ఆసిస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. అదొక్కటే మైండ్ లో ఉండాలన్నాడు.
2011 వరల్డ్ కప్ లో స్థానం లేకపోవడం ఇప్పటికి మరిచిపోలేనని అన్నాడు. అంత బాధ అనుభవించానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఎందుకంటే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తానని అనుకోలేదు. కానీ అది ఇవాళ జరిగింది.’అని రోహిత్ శర్మ ఆనందంగా అన్నాడు.
ఈ వరల్డ్ కప్ కోసం తాము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించామని రోహిత్ వెల్లడించాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. ఆటగాళ్లని అదే దృష్టితో చూసి ఎంపిక చేసుకుంటూ వచ్చామని అన్నాడు.
ఇంతకుముందు షమీ వన్డే ల్లో లేకపోయినా.. వరల్డ్ కప్ 15 మంది జాబితాలో ఉన్నాడని అన్నాడు. కానీ 11 మందిలో తనని మొదటే తీసుకోలేకపోవడం, అది నిజంగా ఒక కఠినమైన నిర్ణయంగానే భావించామని అన్నాడు. కానీ షమీ మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకున్నాడని తెలిపాడు. ఖాళీగా ఉన్నా సరే, నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడని తెలిపాడు.
ఫైనల్ లో ఆడబోయే ఒక్క మ్యాచ్ కరెక్టుగా ఆడితేనే, గెలిచిన ఆ పదింటికి విలువ ఉంటుందని అన్నాడు. అందుకే నా దృష్టి అంతా ఆడబోయే మ్యాచ్ మీదే ఉందని అన్నాడు. టీమ్ ఇండియాలో ప్రతి ఆటగాడు వందశాతం ఎఫర్టు పెడుతున్నారని, ఇదొక శుభ పరిణామమని అన్నాడు. చాలా అంశాలు టీమ్ ఇండియాకి కలిసి వస్తున్నాయి.. ఇక్కడ కూడా రావాలని ఆశిద్దామని అన్నాడు.