BigTV English

India Coach Ankit kaliyar : బొద్దుగా ఉంటే.. ఫిట్ గా లేడని కాదు ..

India Coach Ankit kaliyar : బొద్దుగా ఉంటే.. ఫిట్ గా లేడని కాదు ..

India Coach Ankit kaliyar : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట పలు కామెంట్లు వినిపిస్తుంటాయి. బొద్దుగా ఉంటాడని, వళ్లు వంచలేడని, పరుగెత్త లేడని అంటూ ఉంటారు. వీటన్నింటిపై బీసీసీఐ స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ అంకిత్ కాలియార్ వ్యాఖ్యానించాడు. దీనికి నిదర్శనం రోహిత్ శర్మ ఎన్నో సార్లు యోయో టెస్ట్ పాస్ కావడమే అన్నారు.


ఇంతకీ యోయో టెస్ట్‌ అంటే ఏదో కాదు. వికెట్ కి వికెట్ కి మధ్య ఉన్నంత దూరం ఉంటుంది. ఒక ఎండ్ లో గుర్తుగా చిన్న చిన్న ప్లాస్టిక్ కోన్ లను ఒక పది వరకు వరుసగా ఏర్పాటు చేస్తారు. ప్లేయర్లు కొంతమంది గ్రౌండ్ లో రన్స్ తీస్తునట్టు అటు ఇటు పరుగెత్తడమే క్రికెటర్లు చేయాల్సిన పని. 2 కిలోమీటర్లను పేస్‌ బౌలర్లయితే 8 నిమిషాల 15 సెకన్లలో, మిగిలిన వారైతే 8 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.  

ఇది చెప్పినంత సులువు కాదు. ఇందులో ఉండే స్థాయిలను బట్టి.. ప్రతి ప్లేయర్‌ పరుగెత్తే వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. స్కోరును బట్టే ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్థానం దక్కుతుంది. ఎంతటి క్రికెటర్‌ అయినా ఈ టెస్ట్‌లో ఫెయిలైతే ఇకంతే. ఈ మధ్యే యోయో టెస్ట్‌తో పాటు 2 కిలోమీటర్ల పరుగును కూడా బీసీసీఐ తీసుకొచ్చింది. ఈ రెండు టెస్టుల్లో ఏదొకటి ప్రతి క్రికెటర్‌ కచ్చితంగా పాస్‌ కావాల్సి ఉంటుంది.


రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్. అందులో సందేహమే లేదని అంకిత్ అన్నాడు. విరాట్ కొహ్లీతో పోల్చి చూస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరూ సమానమైన ఫిట్ నెస్ తోనే ఉంటారని, కాకపోతే రోహిత్ శర్మ శరీర తత్వం వల్ల అలా పైకి కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

విరాట్ కొహ్లీ అయితే మ్యాచ్ ఉన్నా లేకపోయినా డైట్ పక్కాగా ఫాలో అవుతాడు. అలాగే ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడడని చెప్పాడు. రోహిత్ కూడా అంతేనని అన్నాడు. లేకపోతే ఇన్నాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగడం రోహిత్ కి సాధ్యం కాదని అన్నాడు. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ రన్ అవుట్ లు కావడం చూశామా? అని ప్రశ్నించాడు.

ఓపెనర్ గా వెళ్లే రోహిత్, చాలా సందర్భాల్లో ఫస్ట్ డౌన్ వెళ్లే కొహ్లీతో కలిసి ఆడుతా ఉంటాడు. ఇద్దరూ ఒకేలా పరుగెడతారని గుర్తు చేశాడు. ఇకపోతే టీమ్ లో యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కూడా ఫిట్ నెస్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడని కితాబునిచ్చాడు.

అనుక్షణం కొహ్లీని అనుకరిస్తాడని తెలిపాడు. తనేం తింటున్నాడు? తనేం వర్కవుట్స్ చేస్తున్నాడు? ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. అతని వెనుకే తిరుగుతాడు. అతను నెట్ లో ప్రాక్టీస్ చేసే సమయంలో ఫుట్ వర్క్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటాడు. లాంటివన్నీ గమనిస్తాడని తెలిపాడు.

ఇంక రోహిత్ శర్మ అలవోకగా కొట్టే సిక్స్ లను కూడా గమనిస్తుంటాడు. రాబోవు రోజుల్లో టీమ్ ఇండియా క్రికెట్ కి భవిష్యత్ ఆశా కిరణం శుభ్ మన్ గిల్ అని తెలిపాడు.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×