BigTV English
Advertisement

Rajinikanth : జైలర్ బర్త్ డే స్పెషల్.. తలైవర్ 170 టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్..

Rajinikanth : జైలర్ బర్త్ డే స్పెషల్.. తలైవర్ 170 టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్..

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చలు. తలైవర్ ఫాన్స్ కోసం డిసెంబర్ 12.. అంటే ఈరోజు పండుగ వాతావరణం తీసుకురావడం కోసం తలైవర్ 170 మేకర్స్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం తలైవర్ 170 నుంచి మేకర్స్ స్పెషల్ వీడియోని విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.


లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న తలైవర్ 170 సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే రెగ్యులర్ గా స్టార్ట్ అయింది . ఇక ఇందులో రజనీకాంత్ సస్పెన్షన్ లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు టాక్. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్న రజిని వచ్చే సంవత్సరం అభిమానులకు వరుస చిత్రాలతో ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. మొన్న విడుదలైన జైలర్ సినిమాలో రిటైర్డ్ జైలర్ గా అదరగొట్టిన రజిని ఇప్పుడు తలైవర్ 170.. ఓ ఎన్కౌంటర్ విషయంలో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతగా మెప్పిస్తాడో చూడాలి.

ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడు. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. డైరెక్టర్ జ్ఞానవేల్ కాబట్టి కొత్త కథనాలతో మూవీ ని తెరకెక్కించే అవకాశం ఉంది అని అభిమానులు భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం రజిని బర్త్ డే స్పెషల్ గా మూవీకి సంబంధించిన టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు సినిమా టీజర్ ,టైటిల్ విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీలో పుష్ప విలన్..ఫహద్ ఫాసిల్ ఓ ప్రాముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్.


ఇక ఈ సందర్భంగా అభిమానులు తలైవర్ డే.. మోస్ట్ అవైటెడ్ బర్త్డే స్పెషల్ వీడియో.. అంటూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు వీడియోలు పెట్టి ఈ విషయాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సాయంత్రం విడుదల ఈ టీజర్ ,టైటిల్ ప్రేక్షకులను ఎంతవరకు సాటిస్ఫై చేస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×