EPAPER

Paris Paralympics 2024: పారాలింపిక్స్.. 20 పతకాలతో భారత్ జోరు

Paris Paralympics 2024: పారాలింపిక్స్.. 20 పతకాలతో భారత్ జోరు

India Makes History with 20 medals at Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ పతకాల జోరు సాగుతోంది.  ఒకేరోజు మళ్లీ నాలుగు పతకాలు వచ్చి చేరాయి. దీంతో ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యంతో కలిపి భారత్ ఖాతాలో 20 పతకాలు వచ్చాయి. ఇప్పుడు పారాలింపిక్స్ లో భారత్ 19వ స్థానంలో నిలిచింది. మరో నాలుగు రోజులు జరగనున్న పోటీల్లో మరెన్నో పతకాలు వచ్చి, భారత్ ముందడుగు వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.


మంగళవారం రాత్రి దాటాక.. హై జంప్ లో 2, జావెలిన్ త్రో లో 2 పతకాలు భారత్ సొంతమయ్యాయి. హై జంప్ టీ 63 విభాగంలో శరద్ కుమార్ రజత పతకం సాధించాడు. తంగవేలు మరియప్పన్ 1.85 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నాడు.

2016లో జరిగిన పారాలింపిక్స్ లో తంగవేలు స్వర్ణం సాధించాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే ఊపుతో, ఎక్కడా పట్టు సడలకుండా రజత పతకం సాధించడం గొప్ప విషయమని అంటున్నారు. ఎందుకంటే 8ఏళ్లుగా ప్రాక్టీస్ చేయడం చిన్న విషయం కాదని అంటున్నారు.


Also Read: ధోనీలో మరో కోణం దాగుంది.. అంపైర్ అనిల్ చౌదరి

మరోవైపు జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో అర్జీత్ సింగ్ రజతం, గుర్జర్ సుందర్ సింగ్ కాంస్యం గెలిచారు. అన్నింటికి మించి తెలుగమ్మాయి దీప్తి మహిళల 400మీటర్లు టీ-20 విభాగం ఫైనల్ లో కాంస్య పతకం సాధించింది.

ఈరోజు బుధవారం కూడా పలు పతకాలు సాధించే దిశగా భారత అథ్లెట్లు ముందడుగు వేస్తున్నారు. పురుషుల, మహిళల షాట్ పుట్, ఇంకా సైక్లింగ్, పురుషుల క్లబ్ త్రో, పురుషుల 49 కేజీల విభాగంలో పవర్ లిఫ్టింగ్, మహిళల 45 కేజీల విభాగంలో పవర్ లిఫ్టింగు పోటీలున్నాయి. వీటిల్లో మనవాళ్లు ముందడుగు వేస్తే పతకాలు గ్యారంటీ అంటున్నారు.

Related News

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Big Stories

×