BigTV English

IND Vs PAK : ఆసియా కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు కాదు.. కారణం ఏంటంటే..?

IND Vs PAK : ఆసియా కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు కాదు.. కారణం ఏంటంటే..?

IND Vs PAK : ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉందని ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ రద్దు అవుతుందని కొందరూ.. రద్దు కాదని మరికొందరూ.. WCL మ్యాచ్ రద్దు చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ ఎందుకు ఆడుతుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలా ఈ మ్యాచ్ పై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరగడంతో ఈ మ్యాచ్ జరుగకూడదని చాలా మంది భావిస్తున్నారు ఈ దాడి పాకిస్తాన్ కి ముడిపడి ఉండటం.. ఆ తరువాత భారత ఆర్మీ పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.


Also Read :  IPL : KKR కి బ్యాడ్ న్యూస్.. తప్పుకున్న హెడ్ కోచ్..!

టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుందా..? 


భారత్ చేసిన దాడికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేశారు. దీంతో చాలా మంది భారతీయులు టీమిండియా.. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని కోరుకుంటున్నారు. కానీ ఈ మ్యాచ్ అయితే రద్దు కాకపోవచ్చని పలు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ACC అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఇది రెండు జట్ల మధ్య సిరీస్ కాదని.. బహుళ దేశాల టోర్నమెంట్ అని చెబుతున్నారు. భారత్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగితే పాకిస్తాన్ వాకోవర్ లభిస్తుంది. అది సరైన ఫలితం కాదు.. ఈ మ్యాచ్ ను రద్దు చేయలేము. ఎందుకంటే ఆసియా కప్ ను ఐసీసీ కాదు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ACC అధిపతిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఉన్నారు.

ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28

ఎనిమిది సంవత్సరాల పాటు 170 మిలియన్ US డాలర్ల విలువైన ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులను సోనీ నెట్ వర్క్ పొందింది. అంటే దాదాపు 1475 కోట్ల రూపాయలు.. చాలా మంది అభిమానులు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను టీవీలో చూస్తారు. సోనీ నెట్ వర్క్ దీని నుంచి భారీగా ప్రయోజనం పొందుతుంది. మ్యాచ్ రద్దు చేస్తే.. అది ప్రసారకర్త ఆదాయం పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఇది మాత్రమే కాకుండా.. 24 ACC సభ్యులు కూడా భారీ నష్టాలను చవి చూడవచ్చు. ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. నిర్వాహకులు చాలా నష్టపోవాల్సి వచ్చింది. 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. టీమిండియా, పాకిస్తాన్, ఒమన్, యూఏఈలతో గ్రూప్-ఏలో ఉంది. టీమిండియా సెప్టెంబర్ 10న యూఏఈతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 14 పాకిస్తాన్ తో ఆడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్ తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

Related News

Watch Video : డాల్ఫిన్స్ కు కూడా రొనాల్డో తెలుసా… ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

IND Vs PAK : నేడు పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” త‌రువాత మ‌రో స‌మ‌రం

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Big Stories

×