IPL : ఐపీఎల్ టీమ్ కి సంబంధించి ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. ఆటగాళ్లే కాదు.. కోచ్ లు సిబ్బంది కూడా ఛేంజ్ అవుతున్నారు. మరికొందరూ తప్పుకుంటున్నారు. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్ కతా నైట్ రైడర్స్ కి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. తమ ఫ్రాంచైజీ నుంచి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నాడని కేకేఆర్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పండిట్ కొత్త అవకాశాలను అన్వేశించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై అతను కోల్ కతా నైట్ రైడర్స్ కి సంబంధించి ప్రధాన కోచ్ గా కొనసాగరు. అతని అమూల్యమైన సహాయ, సహాకారాలకు కృతజ్ఞతలు.
Also Read : Mahesh Tambe : టీ20 చరిత్రలో వరల్డ్ రికార్డు.. 8బంతుల్లో 5 వికెట్లు.. మహేష్ తాంబే సంచలనం
తప్పుకున్న హెడ్ కోచ్..
2024 ఎడిషన్ లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలపడంలో అతను కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు బలమైన ధృడమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అతనికి ధన్యవాదాలు. అతని నాయకత్వం క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్ కోసం అతనికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ కేకేఆర్ యాజమాన్యం తమ ట్విట్టర్ మెసేజ్ లో పేర్కొంది. పండిట్ 2024 ఎడిషన్ లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టడంతో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ లో అతని ఆధ్వర్యంలో కేకేఆర్ పేలవ ప్రదర్శనలు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంటే 2025లో 14 మ్యాచ్ ల్లో కేవలం 5 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది కేకేఆర్.
పండిట్ పై కేకేఆర్ అసంతృప్తి
దీంతో అప్పటి నుంచి కేకేఆర్ యాజమాన్యం పండిట్ పై కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తాజాగా పండిట్ హెడ్ కోచ్ పదవీ నుంచి తప్పుకున్నట్టు కేకేఆర్ యాజమాన్యమే ముందుగా ప్రకటన చేసింది. పండిట్ 2022 ఆగస్టులో కేకేఆర్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. నాటి కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కావడంతో కేకేఆర్ హెచ్ కోచ్ పదవీకి రాజీనామా చేశాడు. పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ 3 సీజన్లలో 3 సీజన్లలో 42 మ్యాచ్ లు ఆడి 22 మ్యాచ్ ల్లో గెలిచి.. 18 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. 2 మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. కేకేఆర్ యాజమాన్యం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తప్పించినట్టు తెలుస్తోంది. భరత్ అరుణ్ త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా జాయిన్ అవుతాడని సమాచారం. అరుణ్ 2014-2021 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రకాంత్ పండిట్ ఐపీఎల్ లో ఓ కీలక జట్టుకు కోచ్ గా వెళ్లే అవకాశాలున్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడం గమనార్హం. తన ఆధ్వర్యంలో కోల్ కతా విజయం సాధించింది.. ఇప్పుడు తమ జట్టు కూడా టైటిల్ సాధిస్తుందని ఆశపడుతున్నట్టు సమాచారం.