E-Paper
Advertisement

IND vs PAK: పాకిస్తాన్ బాయ్ కాట్..అయినా శ్రీలంక‌కు టీమిండియా వెళ్లాల్సిందే? ఐసీసీ త‌ల‌తిక్క రూల్స్‌

IND vs PAK: పాకిస్తాన్ బాయ్ కాట్..అయినా శ్రీలంక‌కు టీమిండియా వెళ్లాల్సిందే? ఐసీసీ త‌ల‌తిక్క రూల్స్‌
Advertisement

IND vs PAK:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( 2026 Men’s T20 World Cup) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ పైన దొంగ ప్రేమ చూపించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుందట పాకిస్తాన్ ( Pakistan ). ఇలాంటి నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే మ్యాచ్ కోసం శ్రీలంకలోని కొలంబోకు టీమిండియా వెళ్తుందా ? లేదా ఇండియాలోనే ఉంటుందా ? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం… ఫిబ్రవరి 15వ తేదీన కచ్చితంగా టీమిండియా… శ్రీలంకలోని కొలంబోకు చేరుకోవాల్సిందేనట. అలా శ్రీలంక వెళ్తేనే, టీమిండియాకు పాకిస్తాన్ ను ఓడించినట్లు రెండు పాయింట్లు దక్కనున్నాయి.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

పాకిస్తాన్ బాయ్ కాట్.. శ్రీలంకకు ఇండియా వెళ్లాల్సిందేనా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( ind vs pak match ) మధ్య ఫిబ్రవరి 15వ తేదీన శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోమని, బహిష్కరిస్తున్నట్లు నిన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ సర్కార్ ఆదేశాల మేరకు క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీలంకకు టీమిండియా వెళ్ళనవసరం లేదని కొంత మంది వాదిస్తున్నారు. శ్రీలంక‌కు వెళ్లకుండా రెండు పాయింట్లు టీం ఇండియా ఖాతాలో పడిపోయాయి అని ప్రచారం చేస్తున్నారు.

అయితే అదంతా ఫేక్ అని ICC రూల్స్ చెబుతున్నాయి. ఈరోజు ప్రకారం కచ్చితంగా శ్రీలంకలోని కొలంబోకు ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వెళ్లాల్సిందేనట. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కొలంబోలో ప్రెస్ మీట్ కు హాజరు కావాలట. ఆ తర్వాత జెర్సీలు ధరించి గ్రౌండ్ లో జరిగే టాస్ ప్రక్రియకు కూడా సూర్యకుమార్ యాదవ్ పాల్గొనాల్సి ఉంటుందని చెబుతున్నాయి రూల్స్. అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ గ్రౌండ్ లోకి రాకపోతే.. టీమిండియా గెలిచినట్లు రెండు పాయింట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇది ప్రాసెస్. అలా కాదని ఇండియా కొలంబోకు వెళ్లకపోతే… ఎవరికి పాయింట్లు రావు. అప్పుడు పాకిస్తాన్ తరహాలోనే ఇండియా కూడా తప్పు చేసిన‌ట్లు భావిస్తారు. ఇలాంటి నేపథ్యంలో రూల్స్ ప్రకారం ఇండియా కొలంబోకు వెళ్లాలని అంటున్నారు.

ఇండియాతో మళ్ళీ మ్యాచ్ ఆడేందుకు పిసిబి అంగీకారం ?

Advertisement

టీం ఇండియాతో మ్యాచ్ బహిష్కరించినట్లు తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే 48 గంటల లోపు మళ్ళీ తమ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకునే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఐసీసీ తీసుకునే చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ తలవంచి.. ఇండియాతో ఆడేందుకు అంగీకారం తెలుపుతుందని అంటున్నారు.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×