BigTV English

Under-19 World Cup Final: మనోళ్లు గెలుస్తారా..? ఫైనల్ సమరం నేడే..!

Under-19 World Cup Final: మనోళ్లు గెలుస్తారా..? ఫైనల్ సమరం నేడే..!
latest sports news telugu

India Vs Australia U-19 World Cup Final: సౌతాఫ్రికాలో జరగనున్న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ సమరం నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత.. అవే జట్లు అండర్ 19లో ఇలా తలపడటం మళ్లీ యాదృచ్ఛికమే అని చెప్పాలి.


ఈ మెగా టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఓటమి అన్నదే లేకుండా ఫైనల్ వరకు చేరింది. ఈ సిగ్నల్ చూస్తుంటే అందరికీ ఒకింత భయంగా ఉంది. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్‌లో  కూడా సీనియర్లు ఇలాగే ఓటమన్నదే ఎరుగకుండా ఫైనల్ వరకు వెళ్లి అక్కడ బ్యాట్లు ఎత్తేశారు. వికెట్లు సమర్పించారు. ఉత్త చేతులతో వచ్చారు.

పిచ్ ఎలా ఉన్నా, ఒత్తిడిలో నిలిచి ఆడాలంటే ఎంతో సమయస్ఫూర్తి, నిదానం, గుండె బలం, మనో ధైర్యం ఉండాలి. ఇవన్నీ కుర్రాళ్ల జట్టులో ఉన్నాయన్నది సెమీఫైనల్ మ్యాచ్‌లో నిరూపితమైంది. అందువల్ల అందరూ మరోవైపు ధైర్యంగానే ఉన్నారు.


ఎందుకంటే, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదిరించే శక్తి సామర్థ్యాలున్న టీమ్‌గా కుర్రాళ్ల జట్టు ప్రశంసలు అందుకుంటోంది. యువకులైతే నూటికి రెండు వందల శాతం కష్టపడుతున్నారు. ఇక అదృష్టం ఒక్కటే కలిసిరావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read More: Bizarre scenes in Cricket: అదృష్టమంటే ఇతనిదే.. వికెట్ల మధ్యలోంచి బాల్.. బ్యాటర్ నాటౌట్..

యువ భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. గ్రూప్, సూపర్ సిక్స్, సెమీఫైనల్‌లో అన్నింటా కుర్రాళ్లు పోటీ పడి మరి, జట్టు విజయానికి దోహదపడ్డారు. సచిన్ దాస్ (294) రెండు సెంచరీలు మిస్ చేసుకున్నాడు. కానీ జట్టు అవసరాల రీత్యా రిస్క్ షాట్లకు వెళుతున్నాడు.

వ్యక్తిగత రికార్డులకన్నా జట్టు విజయానికి ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి ఆట తీరు ధోనీ, రోహిత్ శర్మ నుంచి చూస్తుంటాం. భవిష్యత్తులో టీమ్ ఇండియాలో స్థానం వస్తే, సుస్థిరం చేసుకునేవాడిలా కనిపిస్తున్నాడు. కెప్టెన్ ఉదయ్ (389), ముషీర్ (338), బౌలింగ్‌లో స్పిన్నర్ సౌమి పాండే (17), పేసర్ నమన్ తివారి (10) రాబోయే భారత జట్టులో ఆశాజనకంగా కనిపిస్తున్నారు.

ఆస్ట్రేలియా నుంచి చూస్తే అంత గొప్ప ప్రదర్శనేమీ లేదు. సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై అతికష్టమ్మీద గెలిచింది. కెప్టెన్ హ్యూ విబ్జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, పేసర్లు కలం విడ్లర్, టామ్ స్ట్రాకర్ వీరు ఫామ్‌లో ఉన్నారు. ఈ నలుగురి మీదే ఆధారపడి జట్టు ఫైనల్ వరకు వచ్చింది. అన్ని మ్యాచ్‌ల్లో వీరోచితంగా ఆడి, ఇక్కడేమైనా ఫెయిల్ అయితే, టీమ్ ఇండియాకి నల్లేరు మీద నడక అవుతుంది.

ఏదేమైనా 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురైన కొన్ని సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి. మరి వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమ్ ఇండియా కుర్రాళ్లు విజయం సాధించాలని కోరుకుందాం.

Tags

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×