BigTV English
Advertisement

India Vs Australia Match Preview: హోరాహోరీ పోరు తప్పదా?.. నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

India Vs Australia Match Preview: హోరాహోరీ పోరు తప్పదా?.. నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

T20 World Cup 2024 – India Vs Australia Match Preview: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో ఆస్ట్రేలియా  పరిస్థితి ఒక్కసారి తలకిందులైపోయింది. ఓవర్ కాన్ఫిడెన్సే వారి కొంప ముంచిందని అంతా అంటున్నారు. మొదటి నుంచి అదే జోష్ తో ఉన్నారు. ఆఫ్గనిస్తాన్ బౌలింగుని తేలిగ్గా తీసుకుని, ధనాధన్ ఆడేసి మ్యాచ్ ని ముగించేద్దాం అనుకుని, చివరకు వాళ్లే మునిగిపోయారని అంటున్నారు.


ఇప్పుడు సెమీస్ కి చేరాలంటే ఇండియాపై ఆస్ట్రేలియా గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇండియా ఓడినా పెద్ద ఫరక్ పడదని అంటున్నారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ బాగా ఉండటం వల్ల సెమీస్ అవకాశాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సూపర్ 8లో చివరి మ్యాచ్ నేడు సెయింట్ లూసియాలో జరగనుంది. ఇప్పుడు రెండు జట్ల బలాబలాలను చూస్తే దెబ్బతిన్న పులిలా ఆస్ట్రేలియా కనిపిస్తోంది. అందుకని టీమ్ ఇండియా సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చిందనే చెప్పాలి.


Also Read: ఇంగ్లండ్ సెమీస్ కి చేరినట్టే!.. చిత్తుగా ఓడిన అమెరికా

టీమ్ ఇండియాలో అందరూ ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, శివమ్ దుబె అందరూ టచ్ లోకి వచ్చారు. హార్దిక్ పాండ్యా, పంత్ ఇద్దరూ ఇలాగే ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం జట్టులో చూస్తే బౌలింగే ప్రధాన బలంగా ఉంది. ఎంత తక్కువ స్కోరు అయినా, టీమ్ ఇండియా బౌలర్లు మ్యాచ్ ని గెలిపిస్తున్నారు. ఇదొక ఆశావాహ పరిణామం అని చెప్పాలి. బుమ్రా, అర్షదీప్, కులదీప్, అక్షర్ పటేల్ అందరూ చక్కగా బౌలింగు చేస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే మ్యాక్స్ వెల్ ఫామ్ అందుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించగల మ్యాక్స్ క్రీజులో నిలదొక్కుంటే కష్టమే. ఇక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిడిల్ ఆర్డర్ లో స్టయినీష్ అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇదే ఇప్పటివరకు ఆస్ట్రేలియాను కాపాడిందని అంటున్నారు.

Also Read: Afghanistan win by 8 runs on bangladesh: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో అఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

టీ 20 ప్రపంచకప్ లో ఇంతవరకు రెండు జట్ల మధ్య 5 మ్యాచ్ లు జరిగితే టీమ్ ఇండియా 3 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లు విజయం సాధించాయి. మరి నేటి మ్యాచ్ ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Big Stories

×