India vs Bangladesh Kanpur Test catch will motivate Rohit Sharma to run an extra lap: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు మొదటి రోజు నుంచి వర్షం అడ్డంగిగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ నాలుగో రోజు నేపథ్యంలో… వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు బంగ్లాదేశ్ ఆల్ అవుట్ కావడం జరిగింది. దీంతో… టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది.
ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే బంగ్లాదేశ్ వికెట్ ను బౌలర్ సిరాజ్ పడగొట్టడం జరిగింది. అది కూడా.. బంగ్లా టాప్ క్లాస్ బాటర్.. లిటన్ దాస్ ది. లిటన్ దాస్ క్యాచ్ ను రోహిత్ శర్మ అద్భుతంగా పట్టుకున్నారు. ఈ క్యాచ్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ నకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 50 ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. ఈ 50 ఓవర్… ఇవాళ ఉదయం మహమ్మద్ సిరాజ్ వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో లిటన్ దాస్ స్త్రకింగ్ లో ఉన్నాడు. అయితే సిరాజ్ వేసిన నాలుగో బంతి మిడ్ ఆఫ్ దిశగా ఫోర్ కొట్టాలని లిటిల్ దాస్ ప్రయత్నం చేశాడు. కానీ మీడ్ ఆఫ్ దగ్గరే ఉన్న రోహిత్ శర్మ గాల్లో ఎగిరి మరి ఆ క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ చెవి పట్టుకుని రిషబ్ పంత్ రచ్చ చేశారు. అటు టీమిండియా… ప్లేయర్లు కూడా రోహిత్ శర్మను అభినందించారు.
https://x.com/EnPeyarDinesh/status/1840622128288485616