BigTV English

IND vs BAN: పోరాడి ఓడిన టీమిండియా.. సిరీస్ చేజారే..

IND vs BAN: పోరాడి ఓడిన టీమిండియా.. సిరీస్ చేజారే..

IND vs BAN: ఇటీవల న్యూజిలాండ్.. ఇప్పుడు బంగ్లాదేశ్. టీమిండియాను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. పేపర్ పులులు.. గ్రౌండ్ లో తుస్సుమంటున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్. బంగ్లా దేశ్ విధించిన 271 రన్స్ ను చేధించేందుకు చివరి వరకూ పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఆఖర్లో రోహిత్(51*) చెలరేగి ఆడినా గెలుపు దక్కలేదు. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. 2-0తో సిరీస్ బంగ్లాదేశ్ వశం అయింది.


మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 272 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు తడబడ్డారు. 65 రన్స్ కే 4 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. శ్రేయస్(82), అక్షర్(56) భారత్ ను గెలిపించే ప్రయత్నం చేశారు. కోహ్లీ 5, ధావన్ 8, సుందర్ 11, రాహుల్ 14 లు మరోసారి విఫలమయ్యారు. 9 వికెట్ల నష్టానికి 266 పరుగుల దగ్గరే ఆగిపోయి.. ఓటమి పాలైంది.

టీమిండియాను బంగ్లా బౌలర్లు పకడ్బందీగా కట్టడి చేశారు. హోసెన్ 3, షకీబ్ 2, మెహదీ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢాకా వేదికగా ఈ నెల 10న ఇరు జట్ల మధ్య నామమాత్ర మూడో వన్డే జరగనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×