BigTV English

India vs Canada T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. టాస్ పడకుండానే ఇండియా-కెనడా మ్యాచ్ రద్దు

India vs Canada T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. టాస్ పడకుండానే ఇండియా-కెనడా మ్యాచ్ రద్దు

India vs Canada Match Abandoned: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా-కెనడా మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దు అయ్యింది. కాగా ఇదే వేదికలో శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఇండియా కెనడా మ్యాచ్ రద్దు తర్వాత 7 పాయింట్లో టీమిండియా గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలవగా.. 5 పాయింట్లతో యూఎస్ఏ రెండో స్థానంలో నిలిచింది.


ఇప్పటి వరకు టీమిండియా సేమ్ టీమ్‌ను రిపీట్ చేసింది. ఈ మ్యాచ్‌ నామమాత్రపు మ్యాచ్ కావడంతో కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్‌లో ఉన్న వారిని ఆడించి మ్యాచ్ ప్రాక్టీస్ అయ్యేలా చూడాలనుకుంది. కానీ మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఆశలు ఆవిరయ్యాయి.

తన తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా జూన్ 20న ఆప్ఘనిస్థాన్‌తో సూపర్ 8 మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అమెరికా జూన్ 19న తమ సూపర్ 8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.

గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది నామమాత్రపు మ్యాచ్. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి జరగనుంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×