IND vs ENG 1st Test:: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తి కాగానే… ఇప్పుడు టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది టీం ఇండియా. ఇవాల్టి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో… నెట్స్ లో.. టీమిండియా ప్లేయర్లు చాలా కష్టపడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో… యంగ్ టీమ్ ఇండియా… ఇంగ్లాండ్ వచ్చింది.
Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !
గిల్ కెప్టెన్సీలో రంగంలోకి టీమిండియా
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో… కెప్టెన్ గా గిల్ ఎంపికయ్యారు. గిల్ కెప్టెన్సీ లోనే ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. రిషబ్ పంత్… వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. అటు సీనియర్ బౌలర్లు సిరాజ్, బుమ్రా లాంటి వారు మాత్రమే ఉన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై… గిల్ సేన ఎలాగైనా గెలవాలని… గంటలు గంటలు…. ప్రాక్టీస్ చేస్తోంది.
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచే… ఈ ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్ వేదికగా… కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం… లీడ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య…. జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ డిడి స్పోర్ట్స్ లో ఉచితంగానే ప్రసారం చేస్తున్నారు. వాస్తవంగా విదేశాలలో జరిగే టోర్నమెంట్లు డిడి స్పోర్ట్స్ లో రావు. కానీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న కీలకమైన టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో… డిడి స్పోర్ట్స్ లో లైవ్ ఇస్తున్నారు. అలాగే జియో హాట్ స్టార్ తో పాటు సోనీ లో ఐదు టెస్ట్ మ్యాచ్ లు చూడవచ్చు.
Also Read: Women’s T20 World Cup: ఉమెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే.. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?
ఇండియా బ్యాటింగ్ లైన్ అప్
కె ఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరూ కూడా ఓపెనర్లుగా బరిలో దిగే ఛాన్స్ ఉంది. మూడవ వికెట్ కు కరుణ్ నాయర్ బ్యాటింగ్ చేస్తారు. నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్ బరిలో దిగుతాడు. ఐదవ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కొనసాగనున్నాడు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి కూడా… బరిలో దిగే ఛాన్స్ ఉంది.
IND VS ENG Teams:
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్ (WK), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ