Glenn Maxwell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 tournament) అత్యంత దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా గ్లెన్ మాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. మేజర్ లీగ్ క్రికెటర్ 2025 టోర్నమెంట్లో అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపాడు గ్లెన్ మాక్స్‌వెల్. ఎవరు ఊహించని విధంగా సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్ లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టుకు… మ్యాక్సీ మామ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 49 బంతుల్లో 106 పరుగులు చేసి దుమ్ము లేపాడు గ్లెన్ మాక్స్‌వెల్.
Also Read: virat Kohli : ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. రాత్రంతా చిందులు వేస్తూ రచ్చ ?
సెంచరీ తో రఫ్ఫాడించిన మ్యాక్సీ మామ
మేజర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ 2025లో పంజాబ్ ఆటగాడు మ్యాక్సీ మామ దుమ్ము లేపాడు. 49 బంతుల్లో 106 పరుగులు చేసిన మాక్సిమామ… 13 సిక్సర్లు అలాగే రెండు బౌండరీలతో… రెచ్చిపోయాడు. వాషింగ్టన్ ఫ్రీడం కష్టాల్లో ఉన్న సమయంలో.. జట్టును ఆదుకున్నాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన వాషింగ్టన్ ఫ్రీడం… కేవలం 68 పరుగులే చేసింది. ఆ సమయంలో బ్యాటింగ్కు దిగిన మ్యాక్సీ మామ.. పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 106 పరుగులు చేసి… చుక్కలు చూపించాడు.
ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్సీ మామ అద్భుతమైన సెంచరీ చేయడంతో… వాషింగ్టన్ ఫ్రీడం 113 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం… నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ దారుణంగా విఫలమైంది. 16.3 ఓవర్లు ఆడిన లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్టు.. 95 పరుగులు చేసి కుప్పకూలింది. ఈ తరుణంలోనే 113 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది వాషింగ్టన్ ఫ్రీడం.
ఐపీఎల్ లో ఆడడం చేతకాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం మ్యాక్సీ మామ ఏమాత్రం ఆకట్టుకోలేదు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వరకు బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాక్సిమామ.. మొన్న మెగా వేలంలో పంజాబ్ జట్టుకు వెళ్ళాడు. ప్రీతి జింటా ఏరి కోరి మరి అతన్ని కొనుగోలు చేసింది. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున కూడా పెద్దగా రాణించలేదు మ్యాక్సీ మామ. అలాగే… టోర్నమెంట్ మధ్యలోనే గాయం పేరుతో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
పెద్ద మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !
MLC 2025 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మాక్సిమామ పై ప్రీతి జింటా అభిమానులు ఫైర్ అవుతున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన మాక్సిమామ… ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రీతి జింటాను అన్యాయంగా మోసం చేశాడని… అలాంటి వాడిని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి తీసివేయాలని కోరుతున్నారు.
Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆస్తులు, అతని దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు
At one point, Glenn Maxwell was 11* (15), with no boundaries.
He ended on 106* (49), with two fours and THIRTEEN sixes!
Here's all the boundaries from a remarkable innings 😍
Every #MLC2025 game is streamed live on 7plus: https://t.co/FbUhjSYlqA pic.twitter.com/dZeCpzLxkR
— 7Cricket (@7Cricket) June 18, 2025