Women’s T20 World Cup: క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ని ఈరోజు ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2026 జూన్ 12వ తేదీన ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాష్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ మహిళల టి-20 ప్రపంచ కప్ లో జరిగే తొలి మ్యాచ్ లో అతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడబోతోంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడతాయి.
Also Read: Vaibhav Suryavanshi: 14 ఏళ్ల సూర్య వంశీతో తెలుగులో ఇంటర్వ్యూ… మనతో వైభవ్ హై
గత సంవత్సరం ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక నెలరోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్ లు ఇంగ్లాండ్, వేల్స్ లోని ఏడు వేరు వేరు వేదికలపై జరగబోతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ లతోపాటు.. గ్లోబల్ క్వాలిఫైయర్స్ ఫలితాల ఆదరణంగా మరో నాలుగు జట్లు ఈ వరల్డ్ కప్ కి అర్హత సాధించనున్నాయి. ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా తో పాటు మరో రెండు జట్లు..
గ్రూప్-బి నుండి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ లతో పాటు మరో రెండు జట్లు పోటీ పడబోతున్నాయి. ఈ టోర్నీకి ఎడ్జ్ భాష్టన్, హంప్ షైన్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటి గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. శ్రీలంక – ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ తో జూన్ 12వ తేదీన మొదలయ్యే ఈ మహిళల టీ-20 ప్రపంచ కప్ 2026 టోర్నీ .. జూలై 5న లార్డ్స్ లో ఫైనల్ తో ముగుస్తుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని ఢీ కొట్టబోతోంది. జూన్ 14న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత గ్లోబ్ క్వాలిఫైయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న భారత్ తలపడుతుంది.
ICC మహిళల T-20 ప్రపంచ కప్ 2026 గ్రూపులు:
గ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారతదేశం, పాకిస్తాన్, క్వాలిఫైయర్, క్వాలిఫైయర్
గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, క్వాలిఫైయర్, క్వాలిఫైయర్
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్:
శుక్రవారం జూన్ 12: ఇంగ్లాండ్ vs శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్
శనివారం జూన్ 13: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
శనివారం జూన్ 13: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
శనివారం జూన్ 13: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్
ఆదివారం జూన్ 14: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్‌బాస్టన్
ఆదివారం జూన్ 14: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్
మంగళవారం జూన్ 16: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్
మంగళవారం జూన్ 16: ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్, హాంప్‌షైర్ బౌల్
బుధవారం జూన్ 17: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్, హెడింగ్లీ
బుధవారం జూన్ 17: ఇండియా vs క్వాలిఫైయర్, హెడింగ్లీ
బుధవారం జూన్ 17: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్
గురువారం జూన్ 18: వెస్టిండీస్ vs క్వాలిఫైయర్, హెడింగ్లీ
శుక్రవారం జూన్ 19: న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్, హాంప్‌షైర్ బౌల్
శనివారం జూన్ 20: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్, హాంప్‌షైర్ బౌల్
శనివారం జూన్ 20: పాకిస్తాన్ vs క్వాలిఫైయర్, హాంప్‌షైర్ బౌల్
శనివారం జూన్ 20: ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్, హెడింగ్లీ
ఆదివారం జూన్ 21: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
ఆదివారం జూన్ 21: దక్షిణాఫ్రికా vs ఇండియా, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
మంగళవారం జూన్ 23: న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
మంగళవారం జూన్ 23: శ్రీలంక vs క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
మంగళవారం జూన్ 23: ఆస్ట్రేలియా v పాకిస్తాన్, హెడింగ్లీ
బుధవారం జూన్ 24: ఇంగ్లాండ్ v వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్
గురువారం జూన్ 25: ఇండియా v క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
గురువారం జూన్ 25: దక్షిణాఫ్రికా v క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
శుక్రవారం జూన్ 26: శ్రీలంక v క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
శనివారం జూన్ 27: పాకిస్తాన్ v క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
శనివారం జూన్ 27: వెస్టిండీస్ v క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
శనివారం జూన్ 27: ఇంగ్లాండ్ v న్యూజిలాండ్, ది ఓవల్
ఆదివారం జూన్ 28: దక్షిణాఫ్రికా v క్వాలిఫైయర్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్
ఆదివారం జూన్ 28: ఆస్ట్రేలియా v ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్
మంగళవారం జూన్ 30: TBC v TBC (సెమీఫైనల్ 1), ది ఓవల్
గురువారం జూలై 2: TBC v TBC (సెమీఫైనల్ 2), ది ఓవల్
ఆదివారం జూలై 5: TBC v TBC (ది ఫైనల్), లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్