BigTV English

8 Vasanthalu Review: ‘8 వసంతాలు’ రివ్యూ, బావుకత్వంతో నిండిన బరువైన ప్రేమ కథ

8 Vasanthalu Review: ‘8 వసంతాలు’ రివ్యూ, బావుకత్వంతో నిండిన బరువైన ప్రేమ కథ

8 Vasanthalu Review : కొన్నేళ్ల క్రితం ‘మధురం’ అనే షార్ట్ ఫిలింతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఫణింద్ర నార్సెట్టి. కానీ తర్వాత ‘మను’ అనే సినిమా తీసి ప్లాప్ మూటగట్టుకున్నాడు. అయినప్పటికీ ఏళ్ళ తర్వాత ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి పెద్ద బ్యానర్ ను ఒప్పించి ‘8 వసంతాలు’ అనే సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ : 19 ఏళ్ళ వయసు కలిగిన శుద్ధి అయోధ్య(అనంతిక సునీల్ కుమార్) తన 8 ఏళ్ళ జీవితంలో.. అంటే 11 ఏళ్ళ నుండి 19 ఏళ్ళ వరకు.. ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలని ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. సింపుల్ గా ఆమె జీవితంలోని ఓ 8 ఏళ్ళ ప్రయాణం అని చెప్పొచ్చు. శుద్ధి తండ్రి చనిపోయిన దగ్గర నుండి కుటుంబం కోసం ఆమె పడ్డ స్ట్రగుల్.. తర్వాత ఆమె జీవితంలో వచ్చిన ప్రేమ… అది మిగిల్చిన గాయాలు, జ్ఞాపకాలు..! చివరికి ఆమె లైఫ్ ఏమైంది.? ముగ్గురు హీరోల్లో.. చివరికి ఆమె ఎవరికి దగ్గరైంది? లేక ముగ్గురినీ దూరం చేసుకుందా? సింపుల్ గా ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమాగా చెప్పుకోవచ్చు.

విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ సింపుల్ గా, హానెస్ట్ గా బాగానే ఉంటుంది. కొన్ని డైలాగ్స్ కట్టి పడేస్తాయి.. ఇంకొన్ని ఫోర్స్డ్ గా అనిపించినా.. కనెక్ట్ అయ్యే విధంగా కథనం సాగడం వల్ల ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ కి వచ్చే సరికి… కథనం మరింత స్లో అయ్యింది. ఇక్కడ డైలాగులు క్లాస్ పీకుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి. మ్యూజిక్ మాత్రం బాగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా కథనానికి కరెక్ట్ గా సింక్ అవుతుంది. ప్రేమ కథలు స్లోగా ఉంటాయి. పైగా దర్శకుడు ఫణింద్ర నర్సేట్టి.. కవిత్వంతో నింపేశాడు. అతనితోనే బావుకత్వానికి కనెక్ట్ అయ్యే ప్రేక్షకులకి.. అంటే టార్గెటెడ్ ఆడియన్స్ కి ఇది క్లాసిక్ మూవీ అనిపిస్తుందేమో. కానీ మిగిలిన ప్రేక్షకులకి మాత్రం సహనం అవసరం. ఎంతో ఓపికతో కూర్చుని ప్రతి డైలాగ్ వింటే తప్ప.. కథకి, ఎమోషన్ కి కనెక్ట్ అవ్వలేరు. కొన్ని చోట్ల ఓ షార్ట్ ఫిలిం కథని రెండున్నర గంటలు సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు కాశీ ఫైట్ గురించి ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. కానీ వాస్తవానికి అది అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించదు. కానీ యాక్షన్ కొరియోగ్రాఫర్, అలాగే అనంతిక పడ్డ కష్టం అక్కడ ఇంకాస్త ఎక్కువగా కనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా షార్ట్ ఫిలింని తలపించే ఈ సినిమా.. నిర్మాణ విలువల పరంగా మాత్రం మంచి మార్కులు వేయించుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. 2 పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపధ్య సంగీతం కూడా బాగానే ఉంటుంది. హేషమ్ బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది.


నటీనటుల విషయానికి వస్తే.. అనంతిక సనిల్ కుమార్ ఫుల్ మర్క్స్ కొట్టేస్తుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లో తన గ్రేస్ చూపించి సూపర్ అని విజిల్ వేయించుకుంటుంది. రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి … సెటిల్డ్ యాక్టింగ్ పేరుతో బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ వేసుకుని కనిపించారు. కానీ డైలాగులతో మేనేజ్ చేశారు. మిగతా నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

మ్యూజిక్

డైలాగ్స్

హీరోయిన్ అనంతిక పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్

సెకండాఫ్

క్లైమాక్స్

మొత్తంగా.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. కానీ విపరీతమైన సాగదీత, ఎక్కువ ప్రాసలతో నిండిన డైలాగుల వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ ముగుస్తుంది.

8 Vasanthalu Rating : 2/5

Related News

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Big Stories

×