Big Stories

India won by 5 Wickets: రాంచీ టెస్ట్ లో టీమిండియా విజయం .. సిరీస్ కైవసం

IND vs ENG 4th Test Update

- Advertisement -

India Won the 4th Test match Against England(Sports news headlines): రాంచీ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్ జట్టును విజయతీరాలకు చేర్చారు.

- Advertisement -

ఓవర్ నైట్ స్కోర్ 40/0 రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ .. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రూట్ బౌలింగ్ అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.

ఆ తర్వాత కాసేటికే కెప్టెన్ రోహిత్ శర్మ ( 55, 81 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. స్పిన్నర్ హార్ట్ లీ బౌలింగ్ లో కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటి భారత్ స్కోర్ 99 పరుగులు. మరో పరుగు జోడించిన తర్వాత రజత్ పాటిదార్ తన బ్యాడ్ ఫామ్ ను కొనసాగిస్తూ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 100 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. శుభమన్ గిల్ ( 18 బ్యాటింగ్ ), జడేజా (3 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ విజయానికి మరో 74 పరుగులు మాత్రమే కావాలి.

లంచ్ తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ పై పట్టు సాధించే ప్రయత్న చేసింది. జట్టు స్కోర్ 120 వద్ద భారత్ జడేజా  (4), సర్ఫరాజ్ ఖాన్  (0) వికెట్లను వరుస బంతుల్లో కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ సాగుతోంది. ఇలా భారత్ 36 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో గిల్ , ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధ్రువ్ జురెల్ అధ్బుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.  గిల్  ( 52 నాటౌట్ ) ధృవ్ జురెల్( 39 నాటౌట్ ) అజేయంగా  72 పరుగులు జోడించారు.

ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీ టెస్టుల్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News