BigTV English

India Vs Pakistan: వరల్డ్ కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ల్లో వీరే మొనగాళ్లు…

India Vs Pakistan: వరల్డ్ కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ల్లో వీరే మొనగాళ్లు…

India Vs Pakistan: క్రికెట్ వరల్డ్ కప్ అంటేనే అందరూ అటెన్షన్ లోకి వస్తారు. అందులో ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఆరోజు అందరూ ఆఫీసులకి సెలవులు పెట్టాల్సిందే. అలా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఇండియా 8 సార్లు తలపడింది. అన్నిసార్లు భారత్ విజయం సాధించింది. మరి అప్పుడు జరిగిన మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడి జట్టు విజయానికి తోడ్పడిన వారెవరో చూసేద్దామా…


మొత్తమ్మీద 8 మ్యాచ్ ల్లో చూసుకుంటే…మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 3 సార్లు అందుకున్నాడు. కొహ్లీ, నవజ్యోత్ సింగ్ సిద్దూ, వెంకటేష్ ప్రసాద్, రోహిత్ శర్మ, తాజాగా బూమ్రా ఒకొక్కసారి అందుకున్నారు. ఆనాడు మ్యాచ్ ల్లో వీరే కీలకంగా ఆడి, జట్టు విజయానికి తోడ్పడ్డారు.
1992లో సచిన్, 1996లో సిద్దూ, 1999లో వెంకటేష్ ప్రసాద్, 2003లో సచిన్, 2011లో సచిన్, 2015లో విరాట్ కొహ్లీ, 2019లో రోహిత్ శర్మ, 2023లో బూమ్రా ప్రధాన పాత్ర పోషించారు. 2007లో ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. దాంతో ఒకరికి ఒకరు ఎదురుపడలేదు.

ఇకపోతే 2003 వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఇండియా వెళ్లింది. అప్పుడు టాప్ స్కోరర్ ఎవరంటే సచిన్ టెండుల్కర్…మొత్తం అన్ని మ్యాచ్ లు కలిపి 673 పరుగులు చేశాడు. తర్వాత 465 పరుగులతో సౌరవ్ గంగూలీ రెండోస్థానంలో ఉన్నాడు. వీరిద్దరే నాడు ఫైనల్ వరకు తీసుకువెళ్లారు. కానీ దురద్రష్టం నాడు ఫైనల్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దాంతో మనవాళ్లు 234 పరుగులు చేసి చతికిల పడిపోయారు. రన్నరప్ గా మిగిలిపోయారు.


మరిప్పుడు మంచి దూకుడుగా కనిపించడమే కాదు…టైటిల్ ఫేవరెట్ జట్లలో ఇండియా నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని చెబుతున్నారు. ఈసారి కప్ అందుకుంటారో, లేక ప్రపంచకప్ చరిత్రలో కూడికలు, తీసివేతల్లోనే మిగిలిపోతారో వేచి చూడాలి.

Related News

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Big Stories

×