Rowdy Sheeter Surender: హైదరాబాద్ రౌడీషీటర్ సురేందర్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడిని హత్యచేసిన వారిని చంపుతానంటూ… వరంగల్‌లో సురేందర్ మారణాయుధాలతో తిరుగుతున్నాడు. సెప్టెంబర్ 5న మేడారం అడవుల్లో బాసిత్ హత్యకు గురయ్యాడు. బాసిత్‌ను హత్య చేసిన వారిని చంపేందుకు… సురేందర్ తన గ్యాంగ్‌తో కలిసి రెక్కీ నిర్వహించాడు. నెల రోజులుగా వరంగల్‌లోని వివిధ ప్రాంతాల్లో సామాన్యులను బెదిరించి డబ్బు కూడా వసూలు చేశాడు. ఓ లారీ డ్రైవర్‌ను బెదిరించి సురేందర్ గ్యాంగ్ డబ్బు లాక్కెళ్లడంతో… బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సురేందర్‌పై రాచకొండ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కేసులున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దోపీడీలకు పాల్పడిన కేసులు సురేందర్‌పై ఉండటంతో… గత ఏప్రిల్‌లో అతణ్ని నగరం నుంచి సీపీ బహిష్కరించారు. దాంతో సురేందర్ సిటీని వదిలి వరంగల్ అడ్డాగా నేరాలకు పాల్పడుతున్నాడు. సురేందర్‌తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సురేందర్ గ్యాంగ్‌లోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు.