BigTV English

IND vs SL 2024 1st ODI Preview: ఆ ముగ్గురిలో చోటెవ్వరికి? నేడే టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే

IND vs SL 2024 1st ODI Preview: ఆ ముగ్గురిలో చోటెవ్వరికి? నేడే టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే

India vs Sri lanka 1st ODI Dream11 Prediction(Sports news today): శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ కి సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే సిరీస్ ను కూడా 3-0తో ముగించాలని అభిమానులు ఆశపడుతున్నారు.


ఇకపోతే టీమ్ ఇండియా వన్డే జట్టులోకి కొత్తగా ముగ్గురు ఆటగాళ్లు వచ్చి చేరారు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇక వీరితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వచ్చారు. ఈ ముగ్గురి మొనగాళ్లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ప్రశ్నార్థంగా ఉంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా క్లిష్టమైన సమస్యని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

మిడిలార్డర్ వీక్ గా ఉందని గౌతంగంభీర్ కావాలని శ్రేయాస్ అయ్యర్ ని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు కచ్చితంగా తనకి మొదటి వన్డేలో అవకాశం వస్తుంది. ఇలా చూస్తే రిషబ్ పంత్ ని తీసుకుంటారా? కేఎల్ రాహుల్ ని తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. 2025లో ప్రారంభమయ్యే ఛాలెంజర్స్ ట్రోఫీని ద్రష్టిలో పెట్టుకుని ఇక్కడ వన్డే టీమ్ ని గౌతంగంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించాల్సి ఉంటుంది.


గత ఆసియా కప్ నుంచి రాహుల్ వన్డేల్లో సూపర్ ఫామ్‌లో కొనసాగతున్నాడు. 21 మ్యాచ్‌ల్లో 69 సగటుతో 834 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గత కొంతకాలంగా వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో 66 సగటుతో 530 పరుగులు చేశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ జట్టుకు దూరమవ్వడంతో మిడిలార్డర్‌లో శ్రేయస్-రాహుల్ వన్డే జట్టులో స్థిరపడ్డారు. అయితే ఒకొక్కసారి కీపర్ గా కన్నా, బ్యాటర్ గానే కేఎల్ రాహుల్ సమర్థుడనే పేరుంది.

ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ తో కీపింగ్ చేయించి, కేఎల్ రాహుల్ ని బ్యాటర్ గా తీసుకుంటే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే పంత్ ఇప్పుడే ఆరోగ్యం కోలుకుని వచ్చాడు. తనపై అంత ఒత్తిడి మంచిది కాదని కొందరు అంటున్నారు. ఇంక అలాంటప్పుడు మూడు ఫార్మాట్లకి మూడు టీమ్ లు ఉన్నాయి కాబట్టి..టెస్టు జట్టులో రాహుల్ ని ఆడించి, వన్డే, టీ 20లకు రిషబ్ ని ఆడించమని కొందరు సూచిస్తున్నారు.

Also Read: ఎందుకీ గొడవ : షారూఖ్, కావ్య మారన్ బాధేంటి?

ప్రస్తుతం వన్డే జట్టులో ఎంపికైన ఆటగాళ్లు వీరే..
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ / కేఎల్ రాహుల్, శివమ్ దుబె/రియాన్ పరాగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ /హర్షిత్ రాణా

ఇకపోతే టీ 20లో అద్భుతంగా ఆడిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కి అవకాశం ఇవ్వకపోవడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ఎందుకంటే తను టెస్టు మ్యాచ్ ల్లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అలాంటిది వన్డేల్లో కరెక్టుగా సూట్ అవుతాడు. తనని మూడు ఫార్మాట్లకి అలవాటు చేస్తే, రాబోవు రోజుల్లో టీమ్ ఇండియాకి బ్యాక్ బోన్ గా ఉంటాడని అంటున్నారు. అలాగే సూర్యకుమార్ కి కూడా నెమ్మదిగా వన్డేలు అలవాటు చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. హార్దిక్ పాండ్యా వన్డేలకు దూరంగా ఉంటానని చెప్పడంతో గొడవ లేకుండా పోయింది.

శ్రీలంక టీమ్ లో టీ 20లో ఆడినవారే దాదాపు ఉంటారని అంటున్నారు. మరి కొత్తగా వచ్చేది మ్యాచ్ లోనే తేలుతుంది.

Related News

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే మ్యాచ్ ఫినిష్

IND Vs UAE : కుల్దీప్ అరాచ‌కం..ఒకే ఓవ‌ర్ లో 3 వికెట్లు…కుప్ప‌కూలిన యూఏఈ

Boycott IND vs PAK : టీమిండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌…కార‌ణం ఇదే

IND vs UAE, Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా…ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

T20 World Cup 2026 : 2026 టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే… ఫైనల్ అక్కడే… పాకిస్తాన్ లేకుండానే!

Big Stories

×