BigTV English

India vs Zimbabwe 4th T20: జింబాబ్వేతో మరో పోరుకు సిద్ధమైన భారత్.. నేడు నాలుగో టీ20 మ్యాచ్!

India vs Zimbabwe 4th T20: జింబాబ్వేతో మరో పోరుకు సిద్ధమైన భారత్.. నేడు నాలుగో టీ20 మ్యాచ్!

India vs Zimbabwe 4th T20 updates(Sports news in telugu): భారత్, జింబాబ్వే జట్ట మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం.. హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా.. జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచింది. అయితే భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లోనే షాక్ ఇచ్చిన జింబాబ్వే.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌తో పాటు మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.


టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే అందరూ చక్కటి ఫామ్‌లో కనిపిస్తున్నారు. రెండో మ్యాచ్ నుంచి భారత్ ఆటగాళ్ల సామర్థ్యం బయటపడింది. రెండో టీ20లో ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20లో 23 పరుగుల తేడాతో సులువుగానే నెగ్గింది. ఈ సమయంలో సిరీస్ కాపాడుకునేందుకు గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా ఉండనుంది.

భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లు నిరాశపర్చిన మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ రెండో టీ20లో సెంచరీ చేసి ఫామ్ లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జోరుమీదున్నాడు. యశస్వి సైతం తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ కీలక ఆటగాళ్లు ఇదే జోరుగ కొనసాగిస్తే సిరీస్ కు తిరుగుండదు.


బౌలర్ల విషయానికొస్తే.. పేసర్లు అవేష్, ముకేశ్, ఖలీల్ తోపాటు స్పిన్నర్లు బిష్ణోయ్, సుందర్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు.  మూడో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ గాడితప్పినా చివరి వరకు పోరాడితే కట్టడి చేసే అవకాశం ఉంది.

Tags

Related News

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×