BigTV English

Top Directors Sequels: ‘భారతీయుడు-2’లో కనిపించని శంకర్ మార్క్.. టాప్ డైరెక్టర్స్‌కు సీక్వెల్స్ కలిసిరావడం లేదా?

Top Directors Sequels: ‘భారతీయుడు-2’లో కనిపించని శంకర్ మార్క్.. టాప్ డైరెక్టర్స్‌కు సీక్వెల్స్ కలిసిరావడం లేదా?

Top Directors Sequels: విశ్వనటుడు కమలహాసన్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. ఈ మూవీ జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాగా, 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్ తీశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డైరెక్టర్, హీరో కలిసి పనిచేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో శంకర్ మార్క్ కనిపించ లేదని ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.


డైరెక్టర్ శంకర్ అంటే ఇండియా మొత్తం తెలుసు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో అలరించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన స్వీకెల్ చిత్రం భారతీయుడు 2 నిరాశపరిచింది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాలో శంకర్ మార్క్ కనపడలేదని, భారతీయుడు సీక్వెల్ నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. అంటే రోబో 2 లాగే శంకర్ సీక్వెల్ ప్లాన్ మళ్లీ వర్కవుట్ కాలేదా అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు టాప్ డైరెక్టర్స్ తీసిన సీక్వెల్ చిత్రాలు వర్కవుట్ కావట్లేదని తెలుస్తోంది. అంతకుముందు డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్’రవితేజ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. కొంతకాలం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచనతో కిక్ 2 తీశారు. కానీ ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు.
ఇక టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ సినిమా సుకుమార్‌కి, అల్లు అర్జున్‌కి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా విజయం చూశాక దీనికి సీక్వెల్ చేయాలనుకున్నారు. దీంతో ‘ఆర్య 2’ తీశారు. కానీ అది ఫ్లాప్ అయింది. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బిగ్గెస్ట్ హిట్ అయింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ వస్తుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా చూడాలి మరి.
ఇదిలా ఉంటే..శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది. ఈ భారతీయుడు 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమాపై పడుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×