BigTV English

Hydrabad:‘హైడ్రా’ బాద్ కు ఇకపై సరికొత్త సేవలు

Hydrabad:‘హైడ్రా’ బాద్ కు ఇకపై సరికొత్త సేవలు

HYDRA introducing to GHMC circle for control of Disasters:


విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న భాగ్యనగరానికి ఉన్న ఒకే ఒక్క బ్యాక్ డ్రాప్ వరదలు. ఎక్కడికక్కడ కుచించుకుపోతున్న నాలాలతో భారీ వర్షం వస్తే చాలు నాలాల మార్గం గుండా నీరు పోయే అవకాశం లేక ఇళ్ల మధ్య, రహదారులను ముంచెత్తుతూ నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికలలో నాటి బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలవడానికి వరదలే కారణమన్న విషయం విదితమే. పైగా పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో నాలా విస్తరణ పనులు ఎక్కడికక్క్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి దాపురించింది. అందుకే రేవంత్ సర్కార్ ఒక బృహత్తర పథకాన్ని తీసుకువస్తోంది. అదే హైడ్రా (HYDRA)(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) అనే ప్రత్యేక డిపార్ట్ మెంట్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

నగర విస్తరణ పరిధి మేరకు..


రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాకు తగినట్లుగా హైదరాబాద్ విస్తరణ పరిధి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆ విస్తరణ పరిధి మేరకు హైడ్రా సేవలు అందించాలనే సీఎం సంకల్పానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్ తో పాటు జీహెచ్ ఎంసీ పరిధిలోకి వచ్చే వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు , గ్రామ పంచాయతీలు అన్నింటినీ హైడ్రా పరిధిలోకి చేర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. వర్షాకాలం ముందే ఎక్కడెక్కడ నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించడం..ఆ ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన గొట్టాల ద్వారా నాలాలకు తరలించడం, రూడ్లపై గుంతలు, గతుకులు పూడ్చడం ఇందుకు సంబంధించిన శాఖ అధికారులను అప్రమత్తం చేయడం అలాగే నగర ప్రజలకు సురక్షిత నీటిని అందించడం, ఎక్కడెక్కడ లీకేజీలున్నాయో కనిపెట్టడం ఇలాంటివే కాకుండా భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా విపత్తుల నివారణ వ్యవస్థను పటిష్టవంతం చేసేందుకు నడుం బిగించింది.

కబ్జాలపై కన్నేసిన హైడ్రా

జీహెచ్ ఎంసీ పరిధిలో ఇప్పటికే చాలా వరకూ చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. అనుమతి లేకుండా బఫర్ జోన్లలో నిర్మించే ఇళ్లు, నాలా ప్రాంతంలో ఆక్రమించుకుని కట్టుకున్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చేవేయడం వంటి వన్నీ హైడ్రా కిందే వస్తాయి. భారీ వర్షాలు, గాలులకు కూలిపోయే ప్రమాదకర ఫ్లెక్సీలపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఒక్కోసారి భారీ వృక్షాలు సైతం రోడ్లుపై కూలిపోవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వీటన్నింటినీ కంట్రోల్ చేసేందుకు హడ్రా నడుం బిగించనుంది. ఇన్నాళ్లూ ఇవన్నీ వేర్వేరు శాఖలలో ఉండటం వలన ఏ శాఖకు కంప్లయింట్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఇకపై ఈ శాఖలన్నీ ఒకే గొడుగున చేర్చి హైడ్రా గా పనిచేయనుంది. వర్షాలకు కూలిపోయే గెడలు, బిల్డింగ్ లను ముందుగానే గుర్తించి వాటిని కూల్చివేయాల్సిందిగా సూచిస్తారు. ప్రభుత్వ ఆస్తులు. పబ్లిక్ పార్కుల సంరక్షణ ఇవన్నీ కూడా హైడ్రా కిందే తీసుకువచ్చి భవిష్యత్తులో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రేవంత్ సర్కార్ చూస్తోంది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×