Ind vs Eng 1st ODI: టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య ఇవాళ మొదటి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అందరూ ఊహించినట్లుగానే… టీమిండియా ఖాతా ఓపెన్ చేసింది. మొదటి మ్యాచ్ లోనే… గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ సేన. ఇంగ్లాండ్ జట్టు పైన మొదటి వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగంలో… అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు… కేవలం 38.4 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలోకి వెళ్ళింది టీమిండియా.
Also Read: Ind vs Eng 1st Odi: నీ అవ్వ తగ్గేదేలే…నాగపూర్ వన్డేలో పుష్ప రచ్చ మామూలుగా లేదుగా!
ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ క్రికెటర్ గిల్ ( Shubman Gill ) ఏకంగా 87 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. కేవలం 96 బంతుల్లో 87 పరుగులు చేసిన గిల్ ( Shubman Gill ) … ఇందులో 14 ఫోర్లు కొట్టాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు అలాగే రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో 163.89 స్ట్రైట్ తో శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. ఇక టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 47 బంతుల్లో 52 పరుగులు చేసి చివర్లో… అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఆరు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కూడా ఉంది.
ఇక కీ ప్లేయర్లు అందరూ అవుట్ అయినప్పటికీ హార్దిక్ పాండ్యా అలాగే రవీంద్ర జడేజా… జట్టును విజయతీరాలకు చేర్చి… ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు. ఇక అంతకు ముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… 47.4 ఓవర్లలో… 248 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా రాణించినప్పటికీ… ఆ తర్వాత టీమ్ ఇండియా పికప్ అందుకుంది.
Also Read: Travis Head: మళ్లీ ఇండియన్స్ ను రెచ్చగొట్టిన హెడ్… ఆ వేలు చూపించి మరి?
ఈ తరుణంలోనే… 300 ప్లస్ స్కోరు ఇంగ్లాండ్ చేస్తుందనుకుంటే… 248 పరుగులకే చాప చుట్టేసింది. ఫాస్ట్ బౌలర్లు అలాగే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో…. తక్కువ స్కోర్ చేసింది ఇంగ్లాండ్. ఇక ఈ ఇన్నింగ్స్ లో హర్షిత్ రానా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తన మొదటి వన్డే మ్యాచ్ లోనే మూడు వికెట్లు పడగొట్టి రికార్డు కూడా సృష్టించాడు. అలాగే మహమ్మద్ షమీ ( Mohammad Shami ) కూడా 8 ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టి రాణించాడు. అలాగే రవీంద్ర జడేజా 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్ ఇచ్చిన 248 పరుగుల లక్ష్యాన్ని… 38 ఓవర్లలోనే ఫినిష్ చేసింది టీమిండియా. దీంతో ఇంగ్లాండ్ పై ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ శర్మ సేన. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలోకి వెళ్ళింది