Ind vs Eng 1st Odi: భారత్ – ఇంగ్లాండ్ మధ్య నేడు తొలి వన్డే మొదలైంది. నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో {Ind vs Eng 1st Odi} టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగలేదు. మోకాలి నొప్పి కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్ కి దూరమయ్యాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇక తొలి వన్డేలో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ మొదట కాస్త దూకుడుగానే రాణించింది. ఓపెనర్లు ఇంగ్లాండ్ కి మంచి శుభారంభాన్ని అందించారు.
Also Read: Travis Head: మళ్లీ ఇండియన్స్ ను రెచ్చగొట్టిన హెడ్… ఆ వేలు చూపించి మరి?
తొలి వికెట్ కి ఓపెనర్లు ఫీల్ సాల్ట్, బెన్ డకెట్ 75 పరుగులు జోడించారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ లో ఫిల్ సాల్ట్ ని శ్రేయస్ అయ్యర్ రన్ అవుట్ చేశాడు. పదవ ఓవర్ లో మరో ఆల్ రౌండర్ హర్షిత్ రానా బౌలింగ్ లో జైశ్వాల్ కి క్యాచ్ ఇచ్చి బెన్ డెకెట్ అవుట్ అయ్యాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ సైతం పెవిలియన్ చేరాడు. ఇలా వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్.
కాగా ఆఫ్ సెంచరీ తో అలరించిన కెప్టెన్ జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జాకోబ్ బేతెల్ 51, లివింగ్ స్టోన్ 5, బ్రైడెన్ కార్సే 10, ఆదిల్ రషీద్ 21, సాకీబ్ ముహమ్మద్ 2 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా, హర్షిత్ రానా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
అయితే ఈ తొలి వన్డేలో పుష్ప రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 సినిమా రికార్డులు క్రియేట్ చేయడానికి లేడీ గెటప్ (అమ్మవారి గెటప్) కూడా ఓ కారణం. అయితే నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నేడు జరుగుతున్న ఇంగ్లాండ్ – భారత్ మ్యాచ్ ని చూసేందుకు ఇలా పుష్ప రాజ్ గెటప్ లో వచ్చాడు ఓ అభిమాని.
Also Read: Kane Williamson: తెలుగు వాళ్ల కోసం పేరు మార్చుకున్న కేన్..!
మ్యాచ్ చూస్తూ “తగ్గేదే లే” అని ఆడియన్స్ గ్యాలరీలో రచ్చ చేశాడు. ఇలా తొలి వన్డేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు పుష్పరాజ్. దీంతో పుష్పరాజ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇది చూసిన నేటిజెన్లు.. అతను పుష్ప కాదు ఉష్ప, సెకండ్ హ్యాండ్ పుష్ప అక్కడ ఏం చేస్తున్నావు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
https://t.co/xu3uxtZEQy pic.twitter.com/qyM8phDa2q
— Out Of Context Cricket (@GemsOfCricket) February 6, 2025