Travis Head: బోర్డర్ గవాస్కర్ 2024 – 25 లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగోవ టెస్ట్ లో ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. ఈ టెస్ట్ మ్యాచ్ లోని రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ – రిషబ్ పంత్ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ {Travis Head} తన బౌలింగ్ తో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. బాక్సింగ్ డే టెస్ట్ చివరి రోజున రిషబ్ పంత్ వికెట్ పడగొట్టాడు హెడ్.
Also Read: Kane Williamson: తెలుగు వాళ్ల కోసం పేరు మార్చుకున్న కేన్..!
అతడి బౌలింగ్ లో పంత్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ పడగొట్టిన సందర్భంగా ట్రావిస్ హెడ్ {Travis Head} చేసుకున్న సంబరాలు ఆ సందర్భంలో వివాదాస్పదంగా మారాయి. అసభ్యకరమైన సిగ్నల్స్ ఇస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు హెడ్. పాయింట్ అవుట్ ఫింగర్ ని తన లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుని రచ్చ చేశాడు. అలా చేతి వేలిని మరో చేతిలో పెట్టి తిప్పుతూ సెలబ్రేట్ చేసుకోవడంతో.. అతడు ఏ ఉద్దేశంతో అలా సెలబ్రేట్ చేసుకున్నాడో కానీ.. చూసేవారికి మాత్రం ఇది డబుల్ మీనింగ్ లోనే కనిపించింది.
దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్లు సీరియస్ అయ్యారు. అంతేకాదు అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో అతడు {Travis Head} ఈ వివాదంపై స్పందిస్తూ.. తను అలా సెలబ్రేట్ చేసుకుంది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని.. అది తనకు సంబంధించిన సెలబ్రేషన్ అంటూ బదులిచ్చాడు. ఐస్ లో వేలు పెట్టడం అనే సెలబ్రేషన్ చేసుకున్నానని.. ఇది ఎప్పటినుంచో చేసుకుంటున్నానని అన్నాడు.
కానీ పంత్ ని ఇబ్బంది పెట్టడానికి కాదని తెలిపాడు. అంతేకాదు అలా సిగ్నల్ ఇస్తున్నానంటే మరో వికెట్ తీయబోతున్నట్లు అని చెప్పుకొచ్చాడు ట్రావిస్ హెడ్. అయితే తాజాగా మరోసారి {Travis Head} ఇలాంటి సెలబ్రేషన్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈసారి అలా సెలబ్రేషన్ చేసుకోకుండా.. కొత్తగా చేతికి షాక్ షాక్ కొట్టినట్లు బిహేవ్ చేస్తూ వికెట్ తీసిన సంబరాలు చేసుకున్నాడు.
Also Read: Fact Check: ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. అందరూ తప్పులో కలేశారు ?
శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య నేటి నుండి మొదటి టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండీస్ వికెట్ పడగొట్టిన సందర్భంగా చేతికి షాక్ కొట్టినట్లుగా బిహేవ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు హెడ్. దీంతో హెడ్ {Travis Head} చేసిన ఈ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇండియా ఫ్యాన్స్ కి భయపడే అతడు పాత తరహాలో వేలు చూపించలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక మరికొందరు మాత్రం ఇతడికి కొవ్వు ఇంకా తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/ImTanujSingh/status/1887449070542655997