Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణతో భారీ వర్షసూచన చెబుతున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. కోస్తా, రాయలసీమలో భారీ వర్ష సూచన ఉన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా వాతావరణ కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడనం ఏర్పడుతున్నందున దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది.
హైదరాబాద్‌లో సోమవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో నిన్న సికింద్రాబాద్‌లోని బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యారడైజ్, తార్నాక, హబ్సీగూడ,నాచారం, చిలకలగూడ,మల్లాపూర్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
వరద నీటితో పంజాగుట్ట, లక్డీకపూల్, మలక్‌పేట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్డీకాపూల్ ద్వారకా హోటల్ కూడలిలో నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది మ్యాన్‌హోళ్లలోకి దారి మళ్లించారు.
Also Read: మాటలకందని విషాదం.. ఊహించని ప్రమాదం.. సిగాచీ ఇండస్ట్రీలో ఏం జరిగింది?
అంతేకాకుండా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్నిరోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న వీటిలో మట్టి తడత, నేలకూలిపోవడం, వరదలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లోనూ వర్షాలు ప్రభావితం చేయనున్నాయి. కొన్ని రోజుల పాటు అక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులతో మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్తు తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాత భవనాలు, చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.