WWE Ric Flair : WWE ఆటగాడు రిక్ ఫ్లెయర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అతని జీవిత విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి అతను మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థి. అతని తండ్రి ఒక డాక్టర్. అతని తల్లి ఒక నటి. ఫెయర్ కళాశా నుంచి తప్పుకుని లెజెండరీ మాజీ AWA వరల్డ్ ఛాంపియన్ వెర్న్ గాగ్నే ఆధ్వర్యంలో మ్యాట్ వార్ష్ కోసం శిక్షణ పొందాడు. డిసెంబర్ 10, 1972న విస్కాన్సిన్ లోని రైస్ లేక్ లో పది నిమిషాల డ్రాతో స్క్రాప్ ఐరన్ జార్జ్ గడాష్కీ రెజ్లింగ్ లో తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ లో ఆరంగేట్రం చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో కొన్ని నెలలు గాగ్నే మిన్నియాపాలిస్ బాక్సింగ్, రెజ్లింగ్ క్లబ్ బ్రాండ్ పేరుతో గడిపాడు. ఆ తరువాత ఫ్లెయిర్ నార్త్ కరోలినాలోని షార్లెట్ కి వెళ్లాడు. అక్కడ మ్యాచ్ మేకర్ జార్జ్ స్కాట్ దర్శకత్వంలో జిమ్ క్రోకెట్ ప్రమోషన్స్ అని పిలవబడే ప్రపంచ వ్యాప్త మంజూరు సంస్థ కోసం రెగ్యులర్ గా మారాడు.
Also Read : Mohammed Shami: మహ్మద్ షమీకి బిగ్ షాక్.. భార్యకు నెలకు రూ.4 లక్షల భరణం !
రిక్ ఫ్లెయర్ కి ఆపరేషన్..
ప్రస్తుతం రిక్ ఫ్లెయర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు WWE స్టార్ ఫ్లెయర్.. దాదాపు 21 సార్లు ఛాంపియన్ షిప్ గా నిలిచాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని వయస్సు 76 సంవత్సరాలు. అతనికి కడుపులో ఏదో సమస్య ఉండడం వల్ల ఆపరేషన్ చేశారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీంతో అతడు కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2017లో అతను క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ సమయంలో అతని పెద్దప్రేగుకి శస్త్ర చికిత్స చేశారట. అతనికి చర్మ క్యాన్సర్ మెలనోమా ఉన్నట్టు వెల్లడించాడు. ముఖ్యంగా రిక్ ఫ్లెయర్ యొక్క చివరి టెలివిజన ప్రదర్శన మే 17న AEW కోసం స్టీవ్ మొంగో మెక్ మైఖేల్ కి నివాళి సందర్భంగా కనిపించాడు.
పొట్ట కి ఏకంగా 10కి పైగా కుట్లు..
వాస్తవానికి అతను తమ మొదటి NWA వరల్డ్ టైటిల్ ను 1981లో కైవసం చేసుకున్నాడు. ఇక ఆ తరువాత అతను వరల్డ్ ఛాంపియన్ షిప్ రెజ్లింగ్, విన్స్ మెక్ మహాన్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ రెండింటికీ పని చేశాడు. అతను అధికారికంగా దాదాపు 21 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా గుర్తింపు పొందాడు. రెజ్లింగ్ చరిత్రలో టైటిల్ నాలుగు వెర్షన్ లలో సాధించిన ఏకైక వ్యక్తి రిక్ ఫ్లెయర్ కావడం విశేషం. విచిత్ర విషయం ఏంటంటే..? అతను ఐదుగురు భార్యలను వివాహం చేసుకుంటే.. అందరితో విడాకులు తీసుకోవడం విశేషం. ఐదుగురిలో మొదటి భార్య లెస్లీ గుడ్ మాన్ కి ఇద్దరు పిల్లలు. ఎలిజబెత్ ఫ్లెయర్ కి ఇద్దరూ పిల్లలు. మిగతా ముగ్గురికి పిల్లలు ఏమి లేరు. కానీ వారందరితో కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం రిక్ ఫ్లెయర్ కడుపు కి ఏకంగా 10 కుట్లు పడ్డాయని.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.