BigTV English

IRCTC-Aadhaar: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!

IRCTC-Aadhaar: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!

Indian Railways: తత్కాల్ రైలు టికెట్లను ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకోవడానికి రైల్వేశాఖ కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి(జూలై 1) నుంచి IRCTC అకౌంట్ తో ఆధార్‌ లింక్ చేసిన వారికి మాత్రమే తల్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తత్కాల్ టికెట్ల మోసాలను తగ్గించడం, అనధికార ఏజెంట్ల బుకింగ్‌ను నిరోధించడం, నిజమైన ప్రయాణీకులకు లబ్ది చేకూర్చమే లక్ష్యంగా ఈ నింబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అయితే, ఆధార్‌ ను  IRCTC ఖాతాతో ఎలా లింక్ చేసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


IRCTCని ఆధార్ తో లింక్ చేయాలంటే ఏం కావాలి?  

IRCTC అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేయాడానికి ముందుగా ఏం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.


⦿ యాక్టివ్ IRCTC అకౌంట్

⦿ ఆధార్ నంబర్ లేదంటే వర్చువల్ ID

⦿ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) పొందేందుకు అవసరమైన మొబైల్ ఫోన్

IRCTC అకౌంట్ తో ఆధార్‌ ను ఎలా లింక్ చేయాలి?

⦿ అధికారిక IRCTC వెబ్‌ సైట్‌ కు వెళ్లండి.

⦿ మీ ఆధారాలతో లాగిన్ అవ్వండి.

⦿ మై అకౌంట్ ట్యాబ్‌ కు వెళ్లి ప్రామాణీకరించు అనే ఆప్షన్ ను ఎంచుకోండి.

⦿ ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదంటే వర్చువల్ IDని నమోదు చేయండి.

⦿ వివరాలను ధృవీకరించండి.

⦿ ఆ తర్వాత ఓటీపీని జెనరేట్ చేయండి.

⦿ మీ ఫోన్‌ కు OTP వచ్చిన తర్వాత, దానిని ఎంటర్ చేయాలి.

⦿ ఆ తర్వాత యాక్సెప్ట్ ఫారమ్ ను సమర్పించాలి.

⦿ మీ ఆధార్ విజయవంతంగా ప్రామాణీకరించబడిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

IRCTC అకౌంట్ ప్రయాణీకుడిని ఎలా యాడ్ చేయాలి?

మీ తత్కాల్ బుకింగ్‌ ను వేగంగా బుక్ చేసుకోవడానికి మీ మాస్టర్ జాబితాలో ప్రయాణీకుల వివరాలను ముందస్తుగా యాడ్ చేసుకుని, ఆధార్ ధృవీకరించవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, మై ప్రొఫైల్‌కు వెళ్లి మాస్టర్ లిస్ట్‌ను ఎంచుకోండి.

⦿ ప్రయాణీకుల వివరాలను – పేరు, పుట్టిన తేదీ, లింగం, వారి ఆధార్ కార్డులో ఉన్నట్లుగా ఎంటర్ చేయండి.

⦿ ID రుజువుగా ఆధార్ కార్డును ఎంచుకుని, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

⦿ వివరాలను ఎంటర్ చేయండి. ప్రయాణీకుల ధృవీకరణ స్థితి మొదట పెండింగ్‌ గా చూపబడుతుంది.

⦿ ధృవీకరణ పూర్తయిందో లేదో తనిఖీ చేయడానికి, పెండింగ్‌ లో ఉన్న ఆధార్ ధృవీకరణ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

⦿ వివరాలు ఆధార్ డేటాబేస్‌ తో సరిపోలిన తర్వాత, మీ స్టేటస్ ధృవీకరించబడిందిగా కనిపిస్తుంది.

ఒక ప్రయాణీకుడు ఆధార్ తో ధృవీకరించబడిన తర్వాత, వారి వివరాలు బుకింగ్ సమయంలో మీ మాస్టర్ లిస్ట్ నుంచి నేరుగా అందుబాటులో ఉంటాయి. టికెట్లు ఎక్కువ  డిమాండ్‌లో ఉన్నప్పుడు మీ సమయం వృథా కాకుండా ఈజీగా టికెట్లు పొందేలా ఈ విధానం ఉపయోగపడుతుంది.

Read Also: నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుకింగ్, సరికొత్త PRS వ్యవస్థ వచ్చేస్తోంది!

Related News

Indian Railways: భవిష్యత్ రైలు ప్రయాణం ఇలాగేనా? ఫస్ట్ ప్రయోగంతోనే అదరగొట్టిన రైల్వే!

AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

Condor Airlines plane: విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు

Diwali Tickets Sold out: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే..

India’s Fastest Train: దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Indian Railways: కార్గోపై రైల్వే స్పెషల్ ఫోకస్, గతిశక్తి రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×