BigTV English

Indian Origin Cricketers: వాళ్లు.. మనోళ్లే..! టీ 20 ప్రపంచకప్ ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు

Indian Origin Cricketers: వాళ్లు.. మనోళ్లే..! టీ 20 ప్రపంచకప్ ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు

Indian Origin Cricketers Playing T20 World Cup 2024: ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో మన భారతీయులు క్రికెట్ ఆడుతున్నారు. నిజానికి మన రక్తంలోనే క్రికెట్ ఉంది. అది ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూనే ఉంది. ఎప్పుడో భారతదేశం నుంచి ఇతరదేశాలకు ఉద్యోగ, వ్యాపార రీత్యా వెళ్లి స్థిరపడిపోయిన భారతీయుల సంతతి ఆటగాళ్లు ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో దాదాపు 15 మంది ఆడుతున్నారు.


ఇప్పుడు మనం ఇండియా మాత్రమే గెలవాలని కోరుకోకూడదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఐదు దేశాల్లో మన భారతీయ సంతతి క్రికెటర్లు ఉన్నారు. అందుకని ఒకవేళ మన ఇండియా ఓడిపోయినా మనవాళ్లు ఆడుతున్న దేశాలు గెలవాలని కోరుకుందామని అంటున్నారు. ముఖ్యంగా అమెరికా టీమ్ లో ఆరుగురు, కెనడా నుంచి నలుగురు మనవాళ్లే ఉన్నారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందాం..

న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర
సౌతాఫ్రికా: కేశవ్ మహరాజ్
ఒమన్: కశ్యప్ ప్రజాపతి
కెనడా: రవీంద్రపాల్ సింగ్, పర్గత్ సింగ్, శ్రేయాస్ మొవ్వ, నిఖిల్ దత్తా,
ఉగండా: రోనక్ పటేల్ , ఆల్ఫేశ్ రాంజనీ
యూఎస్ఏ: మోనాంక్ పటేల్, నితీశ్ కుమార్, నిసర్గ్ పటేల్, సౌరభ్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్


వీరిలో న్యూజిలాండ్ నుంచి ఆడుతున్న రచిన్ రవీంద్ర అందరికీ సుపరిచితమే. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడమే కాదు, తన తాతయ్య వాళ్లు ఇంకా బెంగళూరులో ఉండటంతో వారందరినీ వెళ్లి కలిసి వచ్చాడు.

దాంతో భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే ఐపీఎల్ లోని చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడుతున్నాడు. నిజానికి బెంగళూరు జట్టులో ఆడాలని ఉందని తెలిపాడు. మరి వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో తన కోరిక తీరాలని ఆశిద్దాం.

ఇకపోతే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా అందరికీ సుపరిచితమే. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాదు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నాడు జై శ్రీరామ్ అంటూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపి.. మనవాళ్లకి మరింత దగ్గరయ్యాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్.. ఇంతవరకు ఏం జరిగింది?

ఇతర జట్లలో ఆటగాళ్లు మరిప్పుడు టీ 20 ప్రపంచకప్ లో ఏమన్నా సంచలనాలు సృష్టిస్తే.. వారు మన భారతీయులకు మరింత దగ్గరవుతారు. నిజానికి వారు ఏదేశానికైనా ఆడనీ.. క్రికెట్ అందరినీ కలుపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాడు మనోడు రా.. వాడు మనోడు అంటూ ఆనందపడుతూ ఉంటారు.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×