BigTV English

ICC chairman Jay Shah: జై షా కంటే ముందు ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన భారతీయులు వీరే..

ICC chairman Jay Shah: జై షా కంటే ముందు ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన భారతీయులు వీరే..

ICC chairman Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్ గా జే షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నోకోవడం జరిగింది. ఐసిసి చైర్మన్ గా గ్రెగ్ బార్క్‌లే పదవికాలం నవంబర్ 2024న ముగియనంది.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడైన జే షా.. బిసిసిఐ సెక్రటరీ, ఏషియా క్రికిట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐసిసి చైర్మన్ పదవి చేపట్టడానికి ఈ రెండు పదవులకు ఆయన రాజీనామా చేయనున్నారు.

35 ఏళ్ల వయసు గల జే షా ఐసీసీ చైర్మన్ గా ఎన్నిక కావడంతో అతి పిన్న వయసు గల ఐసీసీ చైర్మన్ గా రికార్డుకెక్కారు. ఆయన డిసెంబర్ 1, 2024 నుంచి ఐసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్క్‌లే ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మూడో సారి ఆయన చైర్మన్ గా పోటీచేయడానికి నిరాకరించారు. గ్రెగ్ బార్క్‌లే ఐసీసీ చైర్మన్ గా నవంబర్ 2020న ఆ తరువాత 2022లో తిరిగి ఎన్నికయ్యారు.


అయితే ఈసారి ఐసీసీ చైర్మన్ పదవి ఎన్నిక కోసం పోటీ చేయడానికి ఆగస్టు 27న నామినేషన్ చివరి తేది. కానీ జే షా తప్ప మరెవరూ ఈ పదవి కోసం నామినేషన్ చేయలేదు. దీంతో జేషా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

జే సా బిసిసిఐ సెక్రటరీగా అక్టోబర్ 2019న బాధ్యతలు చేపట్టారు, అలాగే ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జనవరి 2021 నుంచి కొనసాగుతున్నారు.

ఐసీసీ చైర్మన్ గా ఎన్నిక అయిన సందర్భంగా జేషా స్పందించారు. ”నేను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నిక కావడం గర్వంగా ఉంది. ఐసీసీ టీమ్, సభ్య దేశాలతో కలిసి క్రికెట్ ని ప్రపంచంలోని నలుమూలల వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తాను. ప్రస్తుతం అడ్వాన్సడ్ టెక్నాలజీ ని అన్ని ఫార్మాట్ల క్రికెట్ లో ఉపయోగిస్తూ.. ప్రపంచంలో కొత్త మార్కెట్లకు విస్తరించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 లో క్రికెట్ ప్రవేశపెట్టబోతుండడంతో క్రికెట్ వ్యాప్తికి ఇది చాలా మంచి అవకాశం. ఈ అవకాశం క్రికెట్ ని అంతర్జీతాయ విస్తరించేందుకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను.” అని అన్నారు.

ఐసీసీ చైర్మన్ గా ఇప్పటివరకు పనిచేసిన భారతీయులు..
జేషా కంటే ముందు ఐసీసీ చైర్మన్, ఐసీసీ అధ్యక్షుడి పదవిని చేపట్టిన భారతీయులున్నారు. జగ్మోహన్ దాల్మియా, షరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఈ నలుగురూ ఐసీసీ చైర్మన్ లేదా ఐసీసీ ప్రెసిడెంట్ పదవులను చేపట్టారు.

ఐసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన తొలి భారతీయుడు జగ్మోహన్ దాల్మియా. ఆయన 1997 నుంచి 2000 వరకు ఈ పదవిలో కొనసాగారు. మరాఠా రాజకీయ నాయకుడు షరద్ పవార్ కూడా 2010 నుంచి 2012 వరకు ఐసీసీ అధ్యక్షుడి పదవిలో ఉన్నారు.

అయితే ఐసీసీ చైర్మన్ గా 2014 నుంచి 2015 వరకు ఎన్ శ్రీనివాసన్ పనిచేశారు. ఆ తరువాత చివరిసారిగా శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిలో నవంబర్ 2015 నుంచి మార్చి 2017 వరకు కొనసాగారు.

Also Read: పాక్ క్రికెట్ ని సంపూర్ణ ప్రక్షాళన చేస్తున్నాం: పీసీబీ చైర్మన్

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×