BigTV English

Actor Darshan: హీరో దర్శన్ ఇష్యూ.. బెంగుళూరు నుంచి బళ్లారి తరలింపు, కష్టాలు తప్పవా?

Actor Darshan: హీరో దర్శన్ ఇష్యూ.. బెంగుళూరు నుంచి బళ్లారి తరలింపు, కష్టాలు తప్పవా?

Actor Darshan: కర్ణాటకలో సంచలనం రేపింది రేణుకాస్వామి హత్య కేసు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు నటుడు దర్శన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో కొందరు అధికారులపై వేటుపడగా, మరికొందర్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. దర్శన్ వ్యవహారంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


చిత్ర దుర్గం ప్రాంతానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక నిందితుడు నటుడు దర్శన్. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని పరప్పన ఆగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలులో తోటి ఖైదీలతో కలిసి సందడి చేయడం కన్నడనాట తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ యవ్వారంలో పోలీసు శాఖ తీరును చాలామంది తప్పుబట్టారు. పరిస్థితి గమనించి పోలీసులు ఉన్నాతాధికారులు, విచారణకు ఆదేశించారు.

దీనికి సంబంధించి ముగ్గురు అధికారులతో కూడిన టీమ్ రంగంలోకి దిగేసింది. దర్శన్ తోపాటు రౌడీ షీటర్లు విల్సన్ గార్డన్, శ్రీనివాస్, మేనేజర్ నాగరాజు కలిసి జైలులో పార్టీ చేసుకోవడంపై దృష్టి సారిం చింది. పార్టీ చేసుకోవడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? కాపీ, సిగరెట్లు ఎలా సమకూర్చారు? అనేదానిపై ఫోకస్ చేశారు. జైలులో సెల్‌ఫోన్లు  వినియోగం, నెట్ కనెక్షన్, వీడియో కాల్స్ పై ఆరా తీస్తోంది.


ALSO READ: ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !

అత్యంత భద్రత కలిగిన బ్యారక్‌లో నటుడు దర్శన్ మాత్రమే ఉంటాడు. ఒకవేళ ఆయనను చూడటానికి ఫ్యామిలీ సభ్యులు వచ్చినా ఖాళీ ప్రదేశంలో కలిసేవారు. బ్యారక్ లోపలికి వెళ్ల నిచ్చేవారు కాదు. రౌడిషీటర్ విల్సన్ గార్డన్ నేరుగా దర్శన్ బ్యారక్ లోకి వెళ్లడంపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. లోపలున్న ఖైదీలంతా దర్శన్ సేవలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు బయట నుంచి బిరియాని, మద్యం తెప్పించుకునేవారని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

న్యాయస్థానం ఆదేశాలతో పరప్పన ఆగ్రహార సెంట్రల్ నుంచి నటుడు దర్శన్‌ను బళ్లారి జైలుకి బుధవారం షిప్ట్ చేయనున్నారు. జైలు భద్రతపై జిల్లా పోలీసు అధికారులతో చర్చించి నివేదికను తీసుకుంది ఆ శాఖ. నార్మల్‌గా అయితే బళ్లారి సెంట్రల్ జైలులో నిత్యం ప్రహారీ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఖైదీలు వారి ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడడం, భోజనం ఇవ్వడం వంటివి జరిగేవి. నటుడు దర్శన్ రానున్న నేపథ్యంలో ప్రహరీ ద్వారాలను పూర్తిగా మూసి వేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

దర్శన్ వ్యవహారంపై జైళ్ల శాఖలో భారీ కుదుపు మొదలైంది. జైళ్ల శాఖ డీఐజీగా దివ్యశ్రీని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లు బెంగుళూరులోని పరప్పన ఆగ్రహార జైలు అధికారిగా సేవలు అందించిన శేషమూర్తిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో సురేష్‌ను నియమించింది. దర్శన్ వ్యవహారంపై పూర్తి స్థాయి రిపోర్టు వచ్చిన తర్వాత పరప్పన ఆగ్రహార జైలులో మరిన్ని మార్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నమాట.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×