Tokyo Gold Medalist Pramod Bhagat Suspended(Live sports news): పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు వెళ్లి.. పతకం సాధించాల్సిన వినేశ్ ఫోగాట్ పై అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన దెబ్బ నుంచి భారత్ ఇంకా కోలుకోలేదు. వినేశ్ ఫైనల్స్ కు వెళ్లి ఉంటే.. గోల్డ్ లేదా సిల్వర్ కచ్చితంగా వచ్చేదన్న ఆశతో చూస్తుండగా తగిలిన ఎదురుదెబ్బ ఇది. తనకు న్యాయం జరగాలని వేసిన పిటిషన్ పై ఇంకా తీర్పు వెలువడలేదు. ఇంతలోనే పారాలింపిక్స్ కు ముందు భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
పారిస్ వేదికగానే పారాలింపిక్స్ 2024 జరగాల్సి ఉంది. ఈ క్రమంలో.. టోక్యో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్ పై అనర్హత వేటు పడింది. మరో 18 నెలల వరకూ ప్రమోద్ ఏ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ ఆడకుండా బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) నిషేధం విధించింది. అందుకు కారణం అతను డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
Also Read: మను-నీరజ్ మ్యారేజ్ గాసిప్స్.. గాలి తీసేసిన తండ్రి.. అంత మాట అనేసారేంటి?
12 నెలల సమయంలో 3 సార్లు డోపింగ్ టెస్టుకు రావాలని ఆదేశించగా ప్రమోద్ హాజరు కాలేదని, పైగా ఆ సమయంలో అతనెందుకు రాలేదో, ఎక్కడ ఉన్నాడోనన్న కారణాలు చెప్పడంలోనూ విఫలమయ్యాడని పేర్కొంది. టోక్యో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, 2015,2049,2022 వరల్డ్ ఛాంపియన్ అయిన బిహారీ అథ్లెట్ ప్రమోద భగత్ పై వేటుపడటం భారత్ కు షాకిచ్చింది. ఈ ఏడాది కూడా అతను గోల్డ్ మెడల్ సాధిస్తాడన్న ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి.