Paris Olympics 2024 Medal Tally: పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. అయితే నెంబర్ వన్ గా అమెరికా నిలిచింది. ఒకరోజు ముందు వరకు ఒక్క పతకం తేడాతో చైనా ముందడుగులో ఉంది. కానీ చివరి రోజు జరిగిన ఆటల్లో ఆ ఒక్క బంగారు పతకం సాధించి 40 బంగారు పతకాలతో నెంబర్ వన్ గా మారి అమెరికా తన మార్కు చూపించింది. అయితే చైనా కూడా 40 బంగారు పతకాలతో నిలిచింది. కానీ టోటల్ గా చూస్తే అమెరికాతో పోటీ పడలేకపోయింది.
మొత్తానికి అమెరికా 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలతో మొత్తం 126 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కూడా 40 బంగారు పతకాలు సాధించింది. 27 రజత పతకాలు, 24 కాంస్య పతకాలతో 91 సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో జపాన్ నిలిచింది. 20 బంగారు, 12 రజత, 13 కాంస్య పతకాలతో మొత్తం 45 పతకాలు సాధించింది.
నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా 18 బంగారు, 19 రజత, 16 కాంస్య పతకాలతో మొత్తం 53 పతకాలు సాధించింది.
ఐదో స్థానంలో ఆతిథ్య దేశం ఫ్రాన్స్ నిలిచింది. 16 బంగారు, 26 రజత, 22 కాంస్య పతకాలతో మొత్తం 64 పతకాలు సాధించింది.
ఆరో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది. 15 బంగారు, 7 రజత, 12 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించింది.
ఏడో స్థానంలో గ్రేట్ బ్రిటన్ నిలిచింది. 14 బంగారు, 22 రజత, 29 కాంస్య పతకాలతో మొత్తం 65 పతకాలు సాధించింది.
ఎనిమిదో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిలిచింది. 13 బంగారు, 9 రజత, 10 కాంస్య పతకాలతో మొత్తం 32 పతకాలు సాధించింది.
తొమ్మిదో స్థానంలో ఇటలీ నిలిచింది. 12 బంగారు, 13 రజత, 15 కాంస్య పతకాలతో మొత్తం 40 పతకాలు సాధించింది.
Also Read: నేడే వినేశ్ ఫొగాట్ పతకంపై తీర్పు..
పదో స్థానంలో జర్మనీ నిలిచింది. 12 బంగారు, 13 రజత, 8 కాంస్య పతకాలతో మొత్తం 33 పతకాలు సాధించింది.
మన దాయాదీ దేశం పాకిస్తాన్ కి 44 ఏళ్ల తర్వాత ఒక బంగారు పతకం వచ్చింది. దీంతో రేస్ లో భారత్ కన్నా ముందుకు జరిగి 62వ స్థానంలోకి వెళ్లింది. అయితే ఒక్క బంగారు పతకం కూడా సాధించలేని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది.
భారత్ తన ఖాతాలో ఒక రజతం, 5 కాంస్య పతకాలతో నిలిచింది. అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కి ఏమైనా పతకం వస్తే.. పతకాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అభిమానులు ఆశపడుతున్నారు. నిజానికి ఆ 100 గ్రాముల గొడవ లేకపోతే, వినేశ్ స్వర్ణ పతకం కూడా సాధించేదని, మన దేశాన్ని పాకిస్తాన్ కన్నా ముందుకు తీసుకువెళ్లేదని అనుకుంటున్నారు.