BigTV English

Ravindra Jadeja with MS Dhoni: గురువు ధోనీకి సమానంగా జడ్డూ.. ఇద్దరూ 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!

Ravindra Jadeja with MS Dhoni: గురువు ధోనీకి సమానంగా జడ్డూ.. ఇద్దరూ 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!
15 Times Player of the Awards
MS Dhoni and Ravindra Jadeja

Ravindra Jadeja Equals MS Dhoni in Player of the Matches in IPL: రవీంద్ర జడేజా.. ఆటలో ఉన్నాడంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. తను ఆల్ రౌండర్ అటు బ్యాట్ లో, ఇటు బాల్ తో రాణించగల సమర్థుడు. అంతేకాదు.. అతని చుట్టూ ఒక వైఫై ఉంటుంది. దాంతో మ్యాచ్ లో ఎక్కడా లేని ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది.


ఎంత సీరియస్ మ్యాచ్ అయినా సరే, తను చేసే విన్యాసాలతో  ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతారు. మరింత ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన ఉత్సాహంతో ఆటాడుతారు. అదే రవీంద్ర జడేజాలో ఉన్న బలం.. అది సమకాలీన క్రికెట్ లో మరెవరిలోనూ చూడలేం.

ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ లో తను సీఎస్కే తరఫున గురువు ధోనీతో కలిసి ఆడుతున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌల్ చేసి, మూడు వికెట్లు తీసి, ఆ జట్టుని తక్కువ స్కోరుకి కట్టడి చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.


Also Read: సమ ఉజ్జీల మధ్య పోరు.. నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ లో జడేజాకు సీఎస్కే తరఫున 15వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. దీంతో తను గురువు ధోనీ సరసన చేరిపోయాడు. ఎందుకంటే ధోనీ కూడా ఇంతవరకు 15సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు గానీ తను మరొక్కటి దాటేస్తే గురువును మించిన శిష్యుడైపోతాడు. తన తర్వాత సీఎస్కేలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నవారిలో సురేశ్ రైనా (12), రుతురాజ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు.

మొన్నటి వరకు అరవీర భయంకరంగా ఆడిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్ ని ధోనీ కరెక్ట్ స్కెచ్ వేశాడు. వారికెలాంటి బాల్స్ వేయాలి? వారి బలహీనతలేమిటి? ఇవన్నీ స్టడీ చేసి మరీ గ్రౌండ్ లోకి వచ్చి, వారికి ముకుతాడు వేశాడు. 137 పరుగులకే కట్టడి చేశారు. దీంట్లో జడేజా పాత్ర కీలకమని చెప్పాలి.

తర్వాత ఛేదనకు వచ్చిన సీఎస్కే టీమ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, 67 పరుగులు చేసి, చివరి వరకు నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించడం విశేషం.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×